పాకిస్థాన్‌పై ‘ఆర్థిక’ దాడి ఉద్ధృతం!


Sun,February 17, 2019 02:23 AM

India hikes customs duty to 200 percent on all goods imported from Pakistan

దిగుమతులపై సుంకం 200 శాతానికి పెంపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: పుల్వామా ఉగ్రదాడికి కారణమైన పాకిస్థాన్‌పై కేంద్ర ప్రభుత్వం ఒక్కొటొక్కటిగా ప్రతీకార చర్యలకు ఉపక్రమిస్తున్నది. మొదట మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (అత్యంత ప్రాధాన్య దేశం) హోదాను ఉపసంహరించిన మోదీ సర్కార్ శనివారం, పాక్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాన్ని భారీగా పెంచింది. పాకిస్థాన్ నుంచి తాజా పండ్లు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు, ఖనిజ దాతువులు, శుద్ధిచేసిన తోలు, పత్తి, సుగంధ ద్రవ్యాలు, నూలు, రబ్బర్ ఉత్పత్తులు, వైద్య పరికరాలు, ప్లాస్టిక్, క్రీడా పరికరాలు తదితర పలు రకాల వస్తువులు ప్రతినిత్యం భారత్‌కు దిగుమతి అవుతుంటాయి. వాటన్నింటిపై సుంకాన్ని కేంద్రం 200 శాతం పెంచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 2017-18లో పాకిస్థాన్ నుంచి రూ.3,482.3 కోట్ల విలువైన వస్తువులు భారత్‌కు దిగుమతి అయ్యాయి. ప్రస్తుతం ఆ దేశం నుంచి వస్తున్న తాజా పండ్లపై 30-50 శాతం, సిమెంట్‌పై 7.5 శాతం కేంద్రం దిగుమతి సుంకం విధిస్తున్నది. దిగుమతి సుంకాన్ని ఇప్పుడు 200 శాతం పెంచడమంటే ఆ వస్తువులపై దాదాపు నిషేధం విధించడమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.

383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles