359 లక్షల కోట్లకు దేశ ఆర్థిక వ్యవస్థ


Fri,September 21, 2018 01:59 AM

India aiming to double its economy to 5 trillion dollars by 2022

రానున్న ఐదేండ్లలో ఇది సాధ్యమే: ప్రధాని మోదీ వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశ ఆర్థిక వ్యవస్థ రానున్న ఐదు నుంచి ఏడేండ్లలో 359 లక్షల కోట్ల(5 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకుంటుందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రస్తుతమున్న ఆర్థిక వ్యవస్థకు ఇది రెట్టింపని తెలిపారు. 359 లక్షల కోట్ల టార్గెట్‌ను చేరుకోవడంలో తయారీ రంగం, వ్యవసాయ రంగం కీలకపాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలోని ద్వారకాలో జరిగిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్, ఎక్స్‌పో సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడమని, ఈ నిర్ణయాల పరంపరను కొనసాగిస్తామని చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధి 8శాతానికిపైగా పెరుగుతున్నదని, ఈ లెక్కన రానున్న ఐదు, ఏడు ఏండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ 359 లక్షల కోట్లకు చేరుకుంటుందని 10 ఏండ్ల నాటికి 718 లక్షల కోట్ల వరకు చేరుకోవచ్చన్నారు.

ఇప్పటికే ఎస్‌బీఐ బ్యాంకులో కొన్ని బ్యాంకులను విలీనం చేశామని, ఈ విలీన ప్రక్రియ కొనసాగింపులో భాగంగా దేనా బ్యాంకు, విజయ బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయాలని నిర్ణయించామని చెప్పారు. ప్రస్తుతం శంకుస్థాపన జరిగిన కన్వెన్షన్ సెంటర్‌ను రూ.25,703 కోట్లతో దాదాపు 221.37 ఎకరాల్లో నిర్మించనున్నామన్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండటానికి ప్రధాని మోదీ ద్వారకాకు మెట్రో రైలులో ప్రయాణించారు. మరోవైపు ప్రధాని మోదీ పలువురు ఆశా వర్కర్లతో సమావేశమయ్యారు.

515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS