రాష్ట్ర ఖజానా నుంచే సీఎం, మంత్రుల ఐటీ చెల్లింపులు!


Sat,September 14, 2019 12:49 AM

In UP income tax for CM and ministers is paid by the treasury since 1981

- యూపీలో 40 ఏండ్లుగా ఇదే ధోరణి.. నిలిపివేయాలని యోగి నిర్ణయం

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో 40 ఏండ్లుగా రాష్ట్ర సీఎంలు, మంత్రులు ఆదాయం పన్ను (ఐటీ) తమ సొంత డబ్బు నుంచి చెల్లించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే వారి పన్నును చెల్లిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 1981లో చేసిన చట్టం ప్రకారం సీఎం, మంత్రులు ఐటీ చెల్లించనవసరం లేదు. 1981లో యూపీ సీఎంగా వీపీ సింగ్ ఉన్నప్పుడు ఈ చట్టం రూపొందించారని యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ తెలిపారు. ఇక ఈ ప్రక్రియను నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు శుక్రవారం తెలిపింది. 1981 నాటి చట్టంపై విమర్శలు వెల్లువెత్తడంతో యోగి సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

119
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles