ఐటీ కేసులో సోనియా, రాహుల్‌కు చుక్కెదురు


Tue,September 11, 2018 12:11 AM

In the case of Sonia and  in the case

-పన్ను రీ అసెస్‌మెంట్ వద్దన్న పిటిషన్లను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రిక యాజమాన్య సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను యంగ్ ఇండియా సంస్థ ద్వారా దక్కించుకునే క్రమంలో అవకతవకలు జరిగాయని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన కేసులో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి చుక్కెదురైంది. తమపై నమోదైన ఆదాయపన్ను కేసు విచారణలో భాగంగా 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయంపన్ను రీ అసెస్‌మెంట్ (పునఃమదింపు)ను వ్యతిరేకిస్తూ సోనియా, రాహుల్‌గాంధీ దాఖలు చేసిన పిటిషన్లను సోమవారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. వీరితోపాటు తనకు సంబంధించిన పన్ను రీ అసెస్‌మెంట్‌ను కూడా చేపట్టవద్దన్న కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం హైకోర్టు తోసిపుచ్చింది.

167
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS