కవితలతో చురకలు


Fri,August 17, 2018 07:39 AM

In one of his famous poems Atal Bihari Vajpayee wrote of death 30 years

-కవిగానూ ప్రసిద్ధిగాంచిన మాజీ ప్రధాని
-ప్రసంగాల్లోనూ కవితా చెణుకులు

చెట్టు మీద ఎక్కిన మనిషి ఎంతో ఎత్తుగా కనిపిస్తాడు చెట్టుకింద ఉన్న మనిషి పొట్టిగా కనిపిస్తాడు మనిషి గొప్పవాడు కాదు నీచుడూ కాదుపెద్దవాడు కాదుచిన్నవాడూ కాదు మనిషి కేవలం మనిషి అవుతాడు
న్యూఢిల్లీ, ఆగస్టు 16: వాజపేయి రాజకీయ నాయకుడిగా ఎంత ప్రసిద్ధులో కవిగానూ అంతే పేరు ప్రఖ్యాతులు సాధించారు. దేశాభివృద్ధి కోసం ఎంత తపించేవారో.. అదే స్థాయిలో సాహితీమధనం చేసేవారు. కవిత్వం తనకు వారసత్వంగా వచ్చిందని తరుచూ చెప్పేవారు. వాజపేయి తండ్రి పండిట్ కృష్ణ వాజపేయి గ్వాలియర్ ప్రాంతంలో కవిగా పేరుగాంచారు. వాజపేయి అన్న అవధ్ బిహారీ వాజపేయి సైతం కవితలు రాసేవారు. ఇంట్లోని ఈ సాహిత్య వాతావరణం వాజపేయిపై ప్రభావం చూపింది. రాజకీయ రంగంలో తీరిక లేకుండా గడిపినా, ప్రధానిగా ఢిల్లీ గద్దెనెక్కినా.. తన అక్షర పిపాసను వదులలేదు. ఆయన రచనల సంఖ్య తక్కువే అయినా అన్నీ లోతైన అర్థాలతో నిండి ఉంటాయి. ఏరికోరి కూర్చినట్టు ఉండే పదాలతో ఎన్నటికీ తాజాగా.. సజీవంగా నిలుస్తాయి. అందుకే కొందరు నాయకులు ఆయన్ని ప్రేమగా మాటల మాంత్రికుడు అని పిలుస్తుంటారు.

1996లో బీజేపీ ఆయనను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడు ఓ నా ప్రభూ.. ఎదుటివారిని కౌగిలించుకోలేనంతగా.. ఎదుగుదలని ఎప్పటికీ ప్రసాదించకు.. అంత కాఠిన్యాన్ని నాకెప్పటికీ ఇవ్వకు అంటూ తన స్పందనను కవిత రూపంలోనే వెలిబుచ్చారు. అదే ఏడాది తన 13 రోజుల ప్రభుత్వం బలపరీక్షకు నిలిచినప్పుడు సైతం పార్లమెంట్‌లో అధికారం ఆట సాగుతుంది. ప్రభుత్వాలు వస్తా యి.. పోతాయి. పార్టీలు పుడుతాయి.. కనుమరుగవుతాయి. అయినా ఈ దేశం ఇలాగే ఉండా లి. నా దేశ ప్రజాస్వామ్యం కలకాలం నిలువాలి అని ఆకాంక్షించారు. రాజకీయ కార్యకలాపాల వల్ల తనకు కవితలు రాసేందుకు తగిన సమ యం దొరుకడం లేదని తరుచూ వ్యాఖ్యానించేవారు. కవిత్వం అంటే స్వీయ వ్యక్తీకరణ. కవిత్వం రావాలంటే మంచి వాతావరణం, ఏకాగ్రత అవసరం. చుట్టూ శబ్దం ఉంటే స్వీయ వ్యక్తీకరణ సాధ్యం కాదు అని పేర్కొనేవారు. ఒకవేళ నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే.. కవిత్వంలో మునిగి తేలేవాడిని. కవి సమ్మేళనాలకు హాజరవుతూ ఉండేవాడిని అని ఓ సందర్భంలో చెప్పారు.

బహిరంగ సభా వేదికల పైనా..

వాజపేయి గొప్ప వక్త. ఆయన రాజకీయ ప్రసంగాల్లో అప్పుడప్పుడు విసిరే కవితలు ప్రధాన ఆకర్షణగా నిలిచేవి. పార్లమెంట్‌లోనూ ఆయన కవితామృతాలు కురిశాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రసంగం మధ్యలో ప్రజా సమస్యలను కవితలుగా మార్చి వినిపించేవారు. ఆ సమయంలో సభ మొత్తం హర్షధ్వానాలు తెలిపేది. అధికారంలో ఉన్నప్పుడు సైతం పలు సందర్భాల్లో కవితలను వినిపించేవారు. అందుకే ఆయన ఏ పక్షంలో ఉన్నా అందరికీ ఇష్టుడిగా మారారు. బహిరంగ సభల్లో ప్రసంగించే సమయంలోనూ వాజపేయి తనదైన శైలిలో కవితలు జోడించేవారు. ప్రత్యర్థులకు చురకలు అంటించేవారు. ప్రజలను ఆకర్షించేవారు. ఈ అద్భుత లక్షణమే వాజపేయిని ఇతర రాజకీయ ప్రముఖుల నుంచి వేరు చేసింది.

2004లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్‌లో పర్యటిస్తున్నప్పుడు నేను అటల్‌ని.. బీహారీని కూడా అంటూ తన పేరునే ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత సోనియాగాంధీ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఇది చేతగాని, అసమర్థ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. దీనికి వాజపేయి స్పందిస్తూ ఆమె ఓ డిక్షనరీని ముందు పెట్టుకొని ఈ పదాలన్నింటినీ ప్రత్యేకంగా ఏరుకొని చెప్తున్నట్టు కనిపిస్తోంది అని చమత్కరించారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరబూశాయి. మరో సందర్భంలో వాజపేయి మంచోడే కానీ.. ఆయన పార్టీ మంచిది కాదంటున్నారు. మరి మంచి వాజపేయిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. ఓ సందర్భంలో ఎల్‌జేపీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ రామమందిరం అంశంలో బీజేపీని ఎద్దేవా చేస్తూ.. బీజేపీ రాముడి గురించి మాట్లాడుతుంది. కానీ రాముడిని ఆచరించదు.

నా పేరులోనే రాముడు ఉన్నాడు అని పేర్కొన్నారు. దీనికి వాజపేయి సమాధానమిస్తూ హరామ్(అరబిక్ పదం)లోనూ రాముడు ఉన్నాడంటూ చురకలు అంటించారు. కశ్మీర్ లేకుండా పాకిస్థాన్ పరిపూర్ణం కాదు అని పాక్ విదేశాంగశాఖ మంత్రి ఓ సందర్భంలో వ్యాఖ్యానించగా.. పాకిస్థాన్ లేకుండా భారత్ కూడా పరిపూర్ణం కాదంటూ వాజపేయి చురకలు అంటించారు.

అవార్డులు

ratna
-భారతరత్న(2014)
-పద్మ విభూషణ్(1992)
-కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి డీలిట్ గౌరవ పురస్కారం(1993)
-లోకమాన్య తిలక్ పురస్కారం(1994)
-ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు(1994)
-భారతరత్న గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డు(1994)

నిర్వహించిన పదవులు

-భారతీయ జన సంఘ్ వ్యవస్థాపక సభ్యుడు(1951)
-రెండవ లోక్‌సభకు ఎన్నిక(1957)
-భారతీయ జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు(1957-57)
-రాజ్యసభ సభ్యుడు(1962)
-నాల్గొవ లోక్‌సభకు రెండోసారి ఎన్నిక(1967)
-పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్(1967-70)
-భారతీయ జన సంఘ్ అధ్యక్షుడు(1968-73)
-ఐదవ లోక్‌సభకు ఎన్నిక(1971) v 6వ లోక్‌సభకు ఎన్నిక(1977)
-విదేశాంగ శాఖ మంత్రి(1977-79)
-జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు(1977-80)
-ఏడవ లోక్‌సభకు ఎన్నిక(1980)
-బీజేపీ అధ్యక్షుడు(1980-86)
-బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు(1980-84, 1986, 1993-96)
-పదవ లోక్‌సభకు ఎన్నిక(1991; ఆరవసారి)
-లోక్‌సభలో ప్రతిపక్ష నేత, విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్(1993-96)
-పదకొండవ లోక్‌సభకు ఎన్నిక(1996; ఏడవసారి)
-భారత ప్రధాని(1996 మే 16 నుంచి 1996 మే 31 వరకు)
-లోక్‌సభ ప్రతిపక్ష నేత(1996-97)
-విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్(1997-98)
-పన్నెండవ లోక్‌సభకు ఎన్నిక(1998; ఎనిమిదోసారి)
-భారత ప్రధాని(1998-99)
-పదమూడవ లోక్‌సభకు ఎన్నిక(1999; తొమ్మిదోసారి)
-భారత ప్రధాని(1999 అక్టోబర్ 13 నుంచి 2004 మే 13 వరకు)
-పద్నాలుగవ లోక్‌సభకు ఎన్నిక(2004)

రచనలు

-నేషనల్ ఇంటిగ్రేషన్(1961)
-డైనమిక్ ఆఫ్ ఎన్ ఓపెన్ సొసైటీ(1977)
-న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ(1979)
-హీల్ ద వూండ్స్: వాజ్‌పేయిస్ అప్పీల్ ఆన్ అస్సాం ట్రాజెడి టు ద పార్లమెంట్(1983)
-వెన్ విల్ అట్రాసిటీస్ ఆన్ హరిజన్స్ స్టాప్?: ఏ.బి.వాజ్ పేయ్స్ స్పీచ్ ఇన్ రాజ్యసభ(1988)
-కుఛ్ లేఖ్, కుఛ్ భూషణ1996)
-సెక్యులర్‌వాద్: భారతీయ పరికల్పన(డాక్టర్ రాజేంద్రప్రసాద్ స్మారక్ వ్యాఖ్యాన్‌మాలా)(1996)
-బిందు-బిందు విచార్(1997) v రాజ్‌నీతీకి రఫ్తిలీ రెహమ్(1997)
-న దైన్యం న పలాయనం(హిందీ సంచిక)(2000)
-నయూ చునౌతీ, నయా అవసర్(హిందీ సంచిక)(2002)
-ఇండియాస్ పర్‌స్పెక్టివ్స్ ఆన్ ఏషియన్ అండ్ ది ఏషియా-పసిపిక్ రీజన్(2003)

1183
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles