మూకదాడి కాదు.. గుండెపోటు!


Wed,September 11, 2019 02:06 AM

In Jharkhand Mob Killing Autopsy Helps Accused Avoid Murder Charges

- తబ్రేజ్ అన్సారీ కేసులో పోస్టుమార్టం నివేదిక
- నిందితులపై హత్య నేరారోపణ తొలిగింపు


సెరైకేలా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తబ్రేజ్ అన్సారీ మూకదాడి కేసు మరో మలుపు తిరిగింది. 11 మంది నిందితులపై మోపిన హత్య నేరారోపణ సెక్షన్ 302ను పోలీసులు తొలిగించారు. పోస్టుమార్టం, వైద్య, ఫోరెన్సిక్ నివేదికల ప్రకారం తబ్రేజ్ గుండెపోటుతో చనిపోయాడని నిర్ధారించినట్లు సెరైకేలా-కార్సావాన్ ఎస్పీ ఎస్ కార్తీక్ మంగళవారం తెలిపారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 304 (ఉద్దేశపూర్వకంగా చేయని హత్యా నేరం) ప్రకారం నిందితులపై విచారణ జరుపనున్నట్లు వెల్లడించారు. జార్ఖండ్‌కు చెందిన తబ్రేజ్ అన్సారీ (24) పూణెలో వెల్డింగ్ పనులు చేసేవాడు. ఈద్ పండగ కోసం సొంత గ్రామానికి బయలుదేరిన త్రబేజ్‌పై ధట్కిడిహ గ్రామంలో జూన్ 17 రాత్రి కొందరు యువకులు మూకదాడికి పాల్పడ్డారు. బైక్ చోరీ చేసేందుకు యత్నించాడని ఆరోపిస్తూ కట్టెలు, ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టారు. జైశ్రీరామ్, జై హనుమాన్ అనాలని అతడిపై ఒత్తిడి తెచ్చారు. దాడి జరిగిన మరునాడు పోలీసులు తబ్రేజ్‌ను అరెస్ట్ చేశారు. అతడి ఆరోగ్యం క్షీణించడంతో జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచనతో 22న టాటా దవాఖానకు తరలించగా తబ్రేజ్ అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు 11 మందిపై హత్యారోపణతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టం, వైద్య నివేదికల ప్రకారం తబ్రీజ్ గుండెపోటుతో మృతి చెందినట్లు తేలిందని ఎస్పీ కార్తీక్ చెప్పారు. ఈ నేపథ్యంలో 11 మంది నిందితులపై మోపిన హత్యారోపణ సెక్షన్ 302ను తొలిగించినట్లు ఆయన పేర్కొన్నారు.

231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles