టేపులు నిజమైనవే


Mon,February 11, 2019 01:32 AM

In Audio Tape Row, BS Yeddyurappa Says Met JDS Lawmaker, Ready For Probe

-కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప అంగీకారం
-కుట్రదారు సీఎం కుమారస్వామి అని ఆరోపణ
-తనకు బీజేపీ రూ.5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిందన్న మరో జేడీఎస్ ఎమ్మెల్యే
-అనైతిక పద్ధతుల్లో అధికారంలోకి వస్తారా?
-ప్రధాని మోదీని ప్రశ్నించిన కేపీసీసీ చీఫ్ గుండూరావు

హుబ్లీ/ బెంగళూరు: కర్ణాటకలో హెచ్‌డీ కుమారస్వామి సారథ్యంలోని జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమల్ కొనసాగుతూనే ఉన్నది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్ర లోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. తా జాగా బడ్జెట్ సమావేశాల్లో తన లక్ష్యానికి చేరుకునేందుకు అవసరమైన అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది. జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ తనయుడు శరణ్‌గౌడతో తాను ఫోన్‌లో మాట్లాడిన మాట నిజమేనని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప అంగీకరించారు. ఇందులో కుట్రదారు సీఎం కుమారస్వామి అని ఆరోపించారు. తద్వారా రప్ప కుమారస్వామిపై నెపం పెట్టేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో తెర వెనుక మంతనాలు సాగిస్తున్నారని ఆరోపణలున్నాయి. కాగా, జేడీఎస్ ఎమ్మె ల్యే శ్రీనివాసగౌడ తాను బీజేపీలో చేరేందుకు రూ.30 కోట్ల ముడుపులు ఇస్తామని ఆఫర్ చేశారని రూ.5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారన్నారు. తాను అవినీతికి పాల్పడను, పాల్పడనివ్వనని చెప్పే ప్రధాని మోదీ.. కర్ణాటకలో బీజేపీ నేతల కుట్రలపై ఏం సమాధానం చెబుతారని కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు ప్రశ్నించారు.

ఎమ్మెల్యే కొడుకుతో భేటీ నిజమే: యడ్యూరప్ప


దేవదుర్గలోలో జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కొడుకు శరణ్‌గౌడతో సమావేశమైన మాట నిజమేనని యడ్యూరప్ప ఒప్పుకున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా హుబ్లీకి వచ్చిన యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే నాగనగౌడ కొడుకు శరణ్‌గౌడతో భేటీ అంతా సీఎం హెచ్‌డీ కుమారస్వామి డైరెక్షన్‌లోనే సాగిందని ప్రత్యారోపణ చేశారు. ఆయన (శరణ్‌గౌడ) మా సంభాషణను రికార్డు చేశారు. ఈ ఆడియో రికార్డుల్లో ప్రధాన భాగం వదిలేసి.. వారికి అనుకూల భాగాన్నే విడుదల చేశా రు అని అన్నారు. దీనిపై ఏ విచారణకైనా తాను సిద్ధమేనన్నారు. అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ చాలా నిజాయితీ పరుడు. ఆయనకు నేను ఏ ఆఫర్ ఇవ్వలేదు అని అన్నా రు. కాగా, యడ్యూరప్ప ఎప్పుడు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారో చెప్పాలని డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర డిమాండ్ చేశారు.

బీజేపీ అడ్వాన్స్ ఇచ్చిందన్న ఎమ్మెల్యే


బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ తనకు అడ్వాన్స్‌గా రూ.5 కోట్లు ఇచ్చిందని జేడీఎస్ ఎమ్మె ల్యే శ్రీనివాసగౌడ ఆరోపించారు. కానీ సీఎం కుమారస్వామి సలహా మేరకే మాజీ డిప్యూటీ సీఎం ఆర్ అశోక్ ద్వారా అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.5 కోట్లు వెనుకకు ఇచ్చేశానని తెలిపారు.

మోదీజీ! మా ప్రశ్నలకు జవాబివ్వండి


ప్రధాని మోదీకి కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ (ప్రధాని) ప్రజాదరణ పొందిన నినాదం నేను తినను.. ఇతరులను తిననివ్వను (నేను అవినీతికి పాల్పడను. ఇతరులను పాల్పడనివ్వను). కానీ కర్ణాటకలో బీజేపీ నేతల బేరసారాలను ఎలా చూస్తారు? అనైతికంగ్లా అధికారం పొందేందుకు మీరు అనుకూలమా? ఆడియో రికార్డులపై యడ్యూరప్ప ప్రకటనను మీరెలా సమర్థిస్తారు? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.

585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles