హోదాను పునరుద్ధరిస్తాం


Wed,March 20, 2019 03:12 AM

In Arunachal Rahul Gandhi targets BJP over PRC protests

-ఈశాన్య రాష్ర్టాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ వరాల జల్లు
-ఈ ప్రాంత భాష, సంస్కృతిని బీజేపీ నాశనం చేసిందని ధ్వజం
-వివాదాస్పద పౌరసత్వ బిల్లుకు తాము వ్యతిరేకమని స్పష్టీకరణ

ఈటానగర్, మార్చి 19: కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ర్టాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీనిచ్చారు. ఈశాన్య రాష్ర్టాల భాష, సామాజిక, సాంస్కృతిక వైవిధ్యాన్ని బీజేపీ ప్రభుత్వం సర్వనాశనం చేస్తున్నదని, ఆరెస్సెస్ భావజాలాన్ని ఇక్కడి ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నదన్నారు. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం ఈటానగర్‌లో రాహుల్ ప్రారంభిస్తూ ఈశాన్య రాష్ర్టాల ప్రజలు కాంగ్రె స్ పార్టీ హృదయానికి అత్యంత దగ్గరగా ఉం టారన్నారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని కాం గ్రెస్ గుర్తించి.. గౌరవించింది. స్థానిక భాష, సంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలుగకుండా చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేసింది. కాంగ్రెస్ పార్టీని అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, కేంద్రంలో అధికారంలోకి తెస్తే ఈశాన్య రాష్ర్టాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తాం అని చెప్పారు. ఈ ప్రాంతానికి గతం లో ప్రత్యేక హోదా కల్పించిన ఘనత తమదేనన్నారు. భౌగోళిక పరిస్థితులు, మౌలిక వస తులు, అభివృద్ధిలేమి, కనెక్టివిటి, కొన్ని రాష్ర్టాల్లోని ప్రత్యేక సమస్యలు, ఇబ్బందుల దృష్ట్యా ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరుతో బీజేపీ తమను విమర్శిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నదని, కానీ తాము ఎవరి వినాశనాన్ని కోరుకోబోమన్నారు. ఆరెస్సెస్ నేపథ్యం, భావజాలం ఉన్నవారినే యూనివర్సిటీల వైస్ చాన్సలర్లుగా నియమిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. వివాదాస్పద పౌరసత్వ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు. ఈశాన్య రాష్ర్టాల ప్రజల హక్కుల్ని కాలరాసే చర్యల్ని కాంగ్రెస్ ఎన్నటికీ చేపట్టబోదని స్పష్టం చేశారు. గతంలో ప్రణాళిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి, ఇక్కడి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించి నిధులు మంజూరు చేసేది. ప్రస్తుత నీతి ఆయోగ్ అనే సంస్థ అధికారులు కేవలం ఢిల్లీలో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి ప్రజల బాధ లు పట్టవు అని విమర్శించారు. ఎన్డీయే హ యాంలో ఈశాన్య రాష్ర్టాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి స్పెషల్ ప్లాన్ అసిస్టెన్స్ (ఎస్‌పీఏ), ఈశాన్య రాష్ర్టాల పారిశ్రామిక విధానం తెస్తాం. స్థానిక యువతకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తాం అని వరాలు కురిపించారు.

277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles