పాకిస్థాన్‌ను ఇప్పటికీ సైన్యమే పాలిస్తున్నది


Tue,September 18, 2018 02:04 AM

Imran Khan has been propped up by Pakistan Army says VK Singh

-నూతన ప్రభుత్వంపై వేచిచూసే ధోరణిని అవలంబిస్తాం
-విదేశాంగశాఖ సహాయ మంత్రి వీకే సింగ్

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగి ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆ దేశాన్ని ఇప్పటికీ సైన్యమే పాలిస్తున్నదని విదేశాంగశాఖ సహాయమంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మార్పును తీసుకువస్తారా? లేదా? అనేదానిపై భారత్ వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నదని ఢిల్లీలో మీడియాకు తెలిపారు. వాణిజ్య సంస్థ ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్ బోర్డర్ మేనేజ్‌మెంట్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. పాకిస్థాన్‌లో ప్రభుత్వం మారిన తర్వాత సరిహద్దుల్లో చొరబాటు ఘటనలు ఎలా ఉన్నాయనే మీడియా ప్రశ్నకు స్పందిస్తూ మీరందరూ మార్పును ఆశిస్తున్నారా? దాని గురించి నాకైతే తెలియదు. సైన్యం అండతో ఆ వ్యక్తి (ఇమ్రాన్‌ఖాన్) నిలబడ్డారు. ఇంకా సైన్యమే పాలిస్తున్నది. కాబట్టి ఆయన సైన్యం చెప్పుచేతల్లో ఉంటారా? లేదా దాని నుంచి బయటపడతారా? అనే విషయంలో వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తాం అని ఇమ్రాన్‌ఖాన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. చర్చలు జరుపడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడే పాకిస్థాన్‌తో సంప్రదింపులకు అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. సిక్కు భక్తుల కోసం కర్తార్‌పూర్ (పాక్‌లోని గురుద్వారా సందర్శన కోసం) సరిహద్దులను తెరుస్తామన్న పాకిస్థాన్ ప్రతిపాదనపై మాట్లాడుతూ ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనలేవీ అందలేదన్నారు.

437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles