టీటీడీ బోర్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలు?


Sat,September 14, 2019 12:43 AM

Implementation of SC, ST and BC Reservation in TTD Board

అమరావతి: దేవాలయ పాలకమండళ్లు, ట్రస్ట్ బోర్డుల్లో రిజర్వేషన్లు అమలుచేయాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ రిజర్వేషన్ల అమలుపై గత అసెంబ్లీ సమావేశాల్లోనే సవరణ బిల్లును ఆమోదించింది. ఇకపై దేవాలయాల కమిటీల్లో, ట్రస్టు బోర్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం పదవులు,మహిళలకు 50 శాతం పదవులు కేటాయించేలా ఉత్తర్వులు జారీచేసింది. త్వరలో ఏర్పాటుకాబోతున్న తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డులో కూడా ఈ రిజర్వేషన్లు అమలుచేస్తారని సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఏపీ సీఎం జగన్ టీటీడీకి పూర్తిస్థాయి ట్రస్టు బోర్డును నియమించనున్నారు. దీనిపై శుక్రవారం తీవ్ర కసరత్తు చేశారు. బీసీసీఐ మాజీ బాస్, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, ఇన్ఫోసిస్ సుధా నారాయణమూర్తి, తెలంగాణ నుంచి మైహోం రామేశ్వరరావు, దిల్‌రాజు, స్వామిస్వరూపానంద సిఫారసుతో సుబ్బారావు పేర్లు దాదాపు ఖరారయ్యాయి.

89
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles