మా సైన్యాన్ని పంపిస్తాం

Mon,October 14, 2019 01:38 AM

-ఉగ్రవాదాన్ని అంతం చేయాలనుకుంటే సాయం చేస్తాం
-పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ ఆఫర్

కర్నాల్ (హర్యానా), అక్టోబర్ 13: ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్థాన్ కృత నిశ్చయంతో ఉంటే.. అందుకు భారత్ సహకారం అందిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అవసరమైతే పాకిస్థాన్‌కు సైనికులను పంపేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉందన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు నేను ఒక సలహా ఇవ్వదలచుకున్నా. ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి మీరు నిబద్ధతతో ఉంటే.. సాయం అందించడానికి మేం సిద్ధం. మీరు మా సైన్యం కావాలని కోరితే.. మీకు సాయం చేసేందుకు మా బలగాలను అక్కడకు పం పుతాం అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఆదివారం హర్యానాలోని కర్నాల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయ న పాల్గొన్నారు. నేను ఇమ్రాన్ ప్రసంగం విన్నా. కశ్మీర్‌కు స్వేచ్ఛ కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉంటామని కూడా ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ గురించి మర్చిపోండి. ఎప్పటికీ దాని గురించి ఆలోచించద్దు. మీరు కశ్మీర్‌ను లేవనెత్తినా, ఏమీ జరుగదు. మాపై ఎవ్వరూ ఒత్తిడి తేలేరు అని రాజ్‌నాథ్ స్పష్టంచేశారు.

281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles