బాగోగులు చూడకపోతే .. ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు


Tue,July 17, 2018 04:46 AM

If ill treated elderly parents can take back property gifte to son

-పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంది
-బాంబే హైకోర్టు స్పష్టీకరణ

ముంబై: జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోని, వారిని రాచిరంపాన పెడుతూ హింసించే పుత్రులకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. తమ సంతానానికి అందజేసిన ఆస్తిలో కొంత భాగాన్ని తిరిగి వెనక్కి తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందని జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం స్పష్టంచేసింది. ముంబైలోని అంధేరికి చెందిన ఓ వృద్ధుడు తన ఫ్లాట్‌లో 50 శాతం భాగాన్ని కుమారుడికి గిఫ్ట్ డీడ్ పేరుతో రాసిచ్చిన ఒప్పందపత్రాన్ని ట్రిబ్యునల్ రద్దుచేయడాన్ని హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ సందర్భంగా అమ్మానాన్నలు, వయోవృద్ధుల సంక్షేమకోసం తీసుకువచ్చిన.. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ నిర్వహణ, సంక్షేమ చట్టం-2007ను ధర్మాసనం ప్రస్తావించింది. ప్రస్తుతం తాము ఉంటున్న ఫ్లాట్‌ను గిఫ్ట్ డీడ్ కింద తన పేరుతో బదలాయిస్తే తండ్రితోపాటు, అతడి రెండో భార్య(సవతి తల్లి) బాగోగుల్ని చూసుకుంటానని కుమారుడు, కోడలు చెప్పారు. కానీ, ఆ తండ్రి 50 శాతం వాటాను మాత్రమే కుమారుడికి బదలాయించాడు. దీంతో సవతి తల్లిని సాకుగా చూపుతూ వారిద్దరి బాగోగుల్ని కుమారుడు, కోడలు నిర్లక్ష్యంచేశారు. ఈ అగ్రిమెంట్‌ను ట్రిబ్యునల్ రద్దుచేయడంలో మాకు ఎలాంటి తప్పు కనిపించడం లేదు అని హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నది.

440

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles