వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా


Sat,January 12, 2019 01:52 AM

IAS officer Shah Faesal resigns from services to 'protest killings in Kashmir

- ఐఏఎస్‌కు రాజీనామా చేసిన కశ్మీర్ యువ అధికారి షా ఫైజల్
శ్రీనగర్, జనవరి 11: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాను పోటీచేయనున్నట్లు ఐఏఎస్ ఉద్యోగానికి ఇటీవల రాజీనామా చేసిన కశ్మీర్ యువ అధికారి షా ఫైజల్ ప్రకటించారు. అయితే, ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతాననే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. దశాబ్దాలుగా జమ్ముకశ్మీర్‌లో అణిచివేతకు గురైన వర్గాల గొంతుకగా తాను పనిచేస్తానని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో పౌరులపై సైనికులు అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ షా ఫైజల్ ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్‌లో తాను చేరుతున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ఫైజల్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో చేరి, బారాముల్లా పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.

339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles