కశ్మీర్ ఐఏఎస్ అధికారి రాజీనామా


Thu,January 10, 2019 02:19 AM

IAS officer Shah Faesal resigns from services to protest killings in kashmir

-జమ్ముకశ్మీర్‌లో సైన్యం అకృత్యాలకు నిరసనగా..
-నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో చేరే అవకాశం!

న్యూఢిల్లీ: కశ్మీరీలపై సైన్యం అమానుష కాండకు పాల్పడుతున్నదని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర యువ ఐఏఎస్ షా ఫైజల్ (35) తన ఉద్యోగానికి రాజీనామా చేశా రు. త్వరలో రాజకీయాల్లో చేరనున్నారు. 2010 లో ఐఏఎస్‌లో టాపర్‌గా నిలిచిన తొలి కశ్మీరీగా ఫైజల్ దేశం దృష్టిని ఆకర్షించారు. సామాన్య కశ్మీరీలపై సైన్యం అకృత్యాలు పెరిగిపోతున్నా, అడ్డుకునేందుకు కేంద్రం చిత్తశుద్ధితో యత్నించడం లేదు. ఇందుకు నిరసనగానే రాజీనామా నిర్ణయం తీసుకున్నా అని ఫేస్‌బుక్‌లో బుధవారం పోస్టు చేశారు. శుక్రవారం తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. హిందుత్వ అతివాద శక్తుల చేతిలో దేశంలోని 20 కోట్ల మంది ముస్లింలు అణిచివేతకు గురవుతున్నారు. కశ్మీరీలపై అకృత్యాలు పెరుగుతున్నాయి. నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటే దాడుల నుంచి కశ్మీరీలను కాపాడాలి అని అన్నారు. ఫైజల్ రాజీనామా నిర్ణయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు.

383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles