జోహార్.. వీర జవాన్

Sun,February 17, 2019 03:05 AM

-మీ త్యాగం అజరామరం
-జాతి ఘన నివాళి
-స్వస్థలాలకు చేరుకున్న అమర జవాన్ల భౌతికకాయాలు
-అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు
-అంతిమయాత్రకు పోటెత్తిన ప్రజానీకం
-పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు
-పాక్‌కు గుణపాఠం చెప్పాలని, ముష్కరులపై దాడిచేయాలని కుటుంబసభ్యుల డిమాండ్

జైపూర్/లక్నో/సిమ్లా/ఫిబ్రవరి 16: బాధాతప్త హృదయాలతో, బరువెక్కిన గుండెలతో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు జాతియావత్తూ ఘనంగా నివాళులర్పించింది. కన్నీటితో చివరిసారి వీడ్కొలు పలికింది. అమరుల భౌతికకాయాలను ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వారి స్వస్థలాలకు పంపించారు. శవ పేటికలో ఉన్న తమ వారిని చూడగానే అమర జవాన్ల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారి రోదనలతో ఆ ప్రాంతం బరువెక్కింది. అమర జవాన్లను కడసారి సాగనంపేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, రాజకీయనేతలు, విద్యార్థులు, ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు తరలివచ్చి శోకాతప్త హృదయాలతో వీడ్కోలు జరిపారు. ఈ సందర్భంగా భారత్‌మాతాకీ జై, పాకిస్థాన్ ముర్దాబాద్, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. పాక్ జెండాలు, ఆ దేశాధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అమరుల త్యాగాలను కీర్తిస్తూ దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. జవాన్ల అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ఆక్రందనలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. పాక్‌కు మర్చిపోలేని గుణపాఠం చెప్పాలని జవాన్ల కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

BHOPAL

అశ్రు నయనాలతో వీడ్కోలు..

యూపీలోని కనౌజ్‌లో జరిగిన జవాన్ ప్రదీప్‌సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో ఆయన కుమార్తె 10 ఏండ్ల సుప్రియా సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో వెంటనే ఆమెను దవాఖానకు తరలించి సపర్యలు చేశారు. కాన్పూర్‌లో జవాన్ శ్యాంబాబు అంత్యక్రియలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, యూపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా జవాలి గ్రామంలో జరిగిన జవాన్ తిలక్‌రాజ్ అంతిమ యాత్రలో సీఎం జైరామ్ ఠాకూర్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, జవాన్ తిలక్‌రాజ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగాన్ని సీఎం ఠాకూర్ ప్రకటించారు. ఉగ్ర దాడిలో కన్నుమూసిన రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు అమరుల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో వారి స్వగ్రామాల్లో జరిగాయి. ఈ కార్యక్రమాలకు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జైపూర్‌లో జవాన్ రోహితష్ లాంబా చితికి రెండేండ్ల వయసున్న ఆయన కుమారుడు నిప్పంటించడం చూపరులను కలచివేసింది.

mohanlal_ratudi-dauhter
అలాగే ఉత్తరాఖండ్‌లోని ఉద్ధంసింగ్ నగర్ జిల్లా మహమ్మద్‌పూర్ బురియా గ్రామంలో జరిగిన జవాన్ వీరేంద్రసింగ్ అంత్యక్రియల్లో ఆయన మూడేండ్ల కుమారుడు చితికి నిప్పంటించడం అక్కడున్న వారికి కన్నీరు తెప్పించింది. డెహ్రాడూన్‌లో ఏఎస్‌ఐ మోహన్‌లాల్ అంతిమ యాత్ర సందర్భంగా ఆయన కుమార్తె ఉబికివస్తున్న కన్నీటిని దిగమింగుకుని కడసారి సెల్యూట్ చేస్తున్న దృశ్యం అక్కడున్న వారికి తీవ్రంగా కలిచివేసింది. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్, ఇతర మంత్రులు మోహన్‌లాల్‌కు నివాళులర్పించారు. పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో జవాన్ కుల్వీందర్‌సింగ్, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో మణిందర్‌సింగ్, ఒడిశాలో ప్రసన్నకుమార్ సాహు, మనోజ్‌కుమార్ బెహ్రా, ఆగ్రాలో కౌశల్‌కుమార్ రావత్, మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో నితిన్ శివాజీ రాథోడ్, సంజయ్‌సింగ్ దీక్షిత్ అంతిమయాత్ర అశ్రు నయనాల మధ్య సాగింది. కర్ణాటకలో అమర జవాన్ హెచ్ గురు భౌతికకాయంపై ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పుష్పగుచ్చం ఉంచి ఘన నివాళులర్పించారు.

Sukhjinder-Singh
అనంతరం గురు స్వగ్రామమైన మాండ్య జిల్లాలోని గుడిగెరెలో అంత్యక్రియలు నిర్వహించారు. అసోంలో హెడ్ కానిస్టేబుల్ మనేశ్వర్ పార్థివదేహాన్ని సీఎం సర్బానంద సోనోవాల్ తన మోశారు. తమిళనాడుకు చెందిన జీ సుబ్రహ్మణ్యన్, సీ శివచంద్రన్ అంతిమయాత్రను వారి స్వగ్రామాల్లో నిర్వహించారు.అంతకుముందు తిరుచిరాపల్లి విమానాశ్రయంలో శివచంద్రన్ మృతదేహానికి రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ నివాళులర్పించారు. బీహార్‌లో జవాన్లు రతక్ కుమార్ ఠాకూర్, సంజయ్‌కుమార్ సిన్హా పార్థివ దేహాలకు సీఎం నితీశ్‌కుమార్ అంజలి ఘటించారు.

1435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles