ఎన్నికల వేళా అదే శాంతి!


Sun,May 19, 2019 02:22 AM

Hindu Muslim unity stands tall in Malerkotla amid poll cacophony

-త్రివర్ణ పతాకంలా పంజాబ్‌లోని మలర్‌కోట్లా ప్రాంతం
మలర్‌కోట్లా (పంజాబ్): ఎన్నికల వేళ రెచ్చగొట్టే ప్రసంగాలు, పలు పార్టీల కార్యకర్తల మధ్య ఆవేశ పూరితమైన వాతావరణం.. ఇలా ఎన్నో అనుభవాలను మనం చూశాం. కానీ పంజాబ్‌లోని సంగ్‌రూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మలర్‌కోట్లా ప్రాంతం శాంతికి చిహ్నంగా విరాజిల్లుతున్నది. ఈ ప్రాంతంలో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్నప్పటికీ హిందూ, సిక్కులతో కలిసి మెలిసి జీవిస్తుంటారు. ఇక్కడ మందిరం, ఒక మసీదు మధ్య ఒకే గోడ ఉన్నది. హనుమాన్ మందిరం బయట ఓ ముస్లిం యువకుడు ప్రసాదం విక్రయిస్తుంటాడు. రంజాన్ శుభాకాంక్షలకు సంబంధించిన గ్రీటింగ్ కార్డులను హిందువు దుకాణంలో ముద్రిస్తుంటారు. ఒక సిక్కు వ్యక్తి దుకాణంలో పనిచేసే ఐదుగురూ ముస్లింలే. ఈ ప్రాంతంలో ఎన్నికల వేళ కూడా రాజకీయ చర్చలు ఉండవు. ఏ రాజకీయ పార్టీ కులం పేరుతో ఓట్లు అడిగే సాహసం (పరోక్షంగా) చేయదు.

144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles