హిమాచల్ విద్యార్థుల గోల్డెన్‌బుక్ రికార్డుMon,June 19, 2017 02:00 AM

Himachal-students
రాంపూర్: సుదీర్ఘ కాలంలో యోగాసనాలు వేయడంలో 11 మంది హిమాచల్ ప్రదేశ్ విద్యార్థులు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో రికార్డు నమోదు చేశారు. ఈ నెల 15 నుంచి రాంపూర్‌లో వీరు యోగా క్యాంప్ నిర్వహించినందుకు ఈ రికార్డు సాధించారని గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ జాతీయ అధిపతి అలోక్‌కుమార్ తెలిపారు. కౌసల్య అనే విద్యార్థిని పశ్చిమోత్తనాసనం వేయడంలో రికార్డు సృష్టించారు. రాంపూర్ పట్టణానికి సమీప గ్రామాల నుంచి పలువురు విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం 4.30 గంటలకు వచ్చి యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తున్నారు. అనూజ్ అనే విద్యార్థి ఒకేసారి 2.25 గంటల పాటు శీర్షాసనం వేయడంలో రికార్డు నెలకొల్పితే.. ఈషా అనే విద్యార్థి సర్వాంగాసన, ఆశిత్ శ్రుజల్ సూర్య నమస్కారాలు చేశారు.

వాషింగ్టన్ డీసీలో యోగా


అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో చారిత్రక జాతీయ మాల్‌లో వందల మంది ఔత్సాహికులు యోగాలో పాల్గొన్నారు. అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా మాట్లాడుతూ యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీస్థాయిలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.

225

More News

VIRAL NEWS