సముద్రుడి ప్రతీకారం!


Tue,July 17, 2018 07:01 AM

High tide dumps tonnes of trash along Mumbai shores

-ముంబై తీరాన్ని ముంచెత్తుతున్న చెత్త గుట్టలు
-భారీ అలలతో కలిసి వ్యర్థాలను నగరంపైకి విసిరికొట్టిన సముద్రం
-తీరానికి కొట్టుకువచ్చిన 215 టన్నుల వ్యర్థాలు

ముంబై, జూలై 16: సముద్రం ప్రతీకారం తీర్చుకుంటున్నది. ఔను మీరు విన్నది నిజమే.. విచక్షణారహితంగా మానవుడు చెత్తాచెదారాన్ని సముద్రంలోకి మళ్లిస్తుంటే.. ఇప్పుడు సముద్రమే అలల రూపంలో తిరిగి వ్యర్థాలను మనపైకి డంప్ చేస్తున్నది. భారీ వర్షాల వల్ల కొద్దిరోజులుగా అలలతోపాటు సముద్రంలోని వ్యర్థాలు టన్నుల కొద్దీ వెనక్కి వస్తూ ముంబై తీరాన్ని ముంచెత్తుతున్నాయి. తాజాగా తీరం వెంట 215 మెట్రిక్ టన్నుల చెత్తను బృహన్ ముంబై కార్పొరేషన్ తొలగించింది. సముద్రంలో ఏర్పడిన రాకాసి అలలతో చెత్త పెద్ద ఎత్తున తీరానికి చేరుతున్నది. ఆదివారం రికార్డు స్థాయిలో 4.97 మీటర్ల ఎత్తులో భారీ అలలు వచ్చాయి. దీంతోపాటు భారీగా వ్యర్థాలు తీరానికి చేరాయి. మెరైన్ డ్రైవ్, దాదర్, మహీం, జుహు, వెర్సోవా, గొరాయ్ బీచుల్లో ఆదివారం 215 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించినట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం పెద్దసంఖ్యలో కార్పొరేషన్ ఉద్యోగులను, యంత్రాలను వినియోగించినట్లు తెలిపారు. సముద్రంలోకి మనం పారేసిన చెత్తను .. సముద్రం తిరిగి మనకే ఇస్తున్నది. దీనికి అధికారులతోపాటు ముఖ్యంగా ప్రజలను కూడా నిందించాలి. అవగాహన లేకే సముద్రంలో భారీగా వ్యర్థాలను డంప్ చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలి అని సామాజిక కార్యకర్త గాడ్‌ఫ్రే పిమెంటా మండిపడ్డారు.

766
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles