హిజ్బుల్ అగ్రశ్రేణి కమాండర్ హతం


Fri,October 12, 2018 12:26 AM

Hezbull Mujahideen is the top commander death

-కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో మనాన్ బషీర్ వనీ, మరో మిలిటెంట్ హతం
-పీహెచ్‌డీ వదిలేసి ఉగ్రవాదిగా మారిన వనీ
శ్రీనగర్: నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతం శట్గంద్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ అగ్రశ్రేణి కమాండర్ మనాన్ బషీర్ వనీతోపాటు మరో మిలిటెంట్ ఆశిష్ హుస్సేన్ హతమయ్యాడు. ఇద్దరు భద్రతాజవాన్లకు గాయాలయ్యాయి. మనాన్ వనీ జియాలజీలో పీహెచ్‌డీ చేస్తూ.. మధ్యలో వదిలేసి ఉగ్రవాదుల్లో చేరారు. వనీ మరణ వార్తతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భద్రతా సంస్థలపై రాళ్లు రువ్వారు. కుప్వారా జిల్లాలో జరిగిన వనీ అంత్యక్రియలకు భారీగా జనం హాజరయ్యారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా వేర్పాటు వాద సంస్థల కూటమి జేఆర్‌ఎల్ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది.

381
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS