ఉప ఎన్నికల్లో 57 శాతం!

Tue,October 22, 2019 03:46 AM

-51 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు ముగిసిన ఉప ఎన్నికలు
-కేరళలోని ఎర్నాకుళంలో వాన బీభత్సం.. ఓటర్ల అవస్థలు

లక్నో/కొచి: దేశంలోని 18 రాష్ట్రాలకు సంబంధించి 51 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు స్థానాలకు సోమవారం జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. ఉప ఎన్నికల్లో సరాసరిగా 57% పోలింగ్ నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 47.05% పోలింగ్ నమోదైంది. ఎన్నికల్లో ప్రతిసారి ఎక్కువ పోలింగ్‌ను నమోదు చేసే కేరళకు ఈసారి వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో ఆ రాష్ర్టంలోని ఐదు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 66% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఎర్నాకుళం నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించడంతో పోలింగ్ కేంద్రాల్లోకి వాన నీరు వచ్చి చేరింది. దీంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఖోన్సా (పశ్చిమ) నియోజకవర్గంలో 90%, నక్సల్ ప్రభావిత చిత్రకోట్(ఛత్తీస్‌గడ్)లో 74%, తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో 84.75%, మధ్యప్రదేశ్‌లోని ఝాబులో 62%, మేఘాలయాలోని షెల్లాలో 84.56% పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. అసోంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సరాసరిగా 75.69% పోలింగ్ నమోదైంది. బీహార్‌లోని ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు సమతిపూర్ పార్లమెంటు స్థానంలో సరాసరిగా 49.50% పోలింగ్ నమోదవ్వగా, మహారాష్ర్టలోని సతారా పార్లమెంట్ నియోజకవర్గ ఉపఎన్నికలో 60% పోలింగ్ నమోదైంది. హిమాచల్‌లోని రెండు అసెంబ్లీ స్థానాల్లో 70%, పంజాబ్‌లోని 4 అసెంబ్లీ స్థానాల్ల్లో 66.50% , రాజస్థాన్‌లోని రెండు అసెంబ్లీ స్థానాల్లో 66%, గుజరాత్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో 51% పోలింగ్ నమోదైంది. పుదుచ్చేరిలోని కమ్రాజ్‌నగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో 70% పోలింగ్ నమోదైంది. తమిళనాడులోని విక్రవాడి అసెంబ్లీ స్థానంలో 84.36%, నంగునేరి అసెంబ్లీ స్థానంలో 66.10% పోలింగ్ రికార్డు అయింది. సిక్కింలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో 70% పోలింగ్ నమోదైంది. ఐతే, తుది పోలింగ్ శాతానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నదని ఈసీ పేర్కొంది.

470
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles