గుబులు రేపుతున్నబుల్‌బుల్

Fri,November 8, 2019 01:55 AM

-నేడు తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం
-ఒడిశాలో భారీ వర్షాలు
-పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరప్రాంతాలపైనా ప్రభావం

భువనేశ్వర్/అహ్మదాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ బుల్‌బుల్ శుక్రవారం తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశాలో శుక్రవారం నుంచి 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 70 నుంచి 80 కి.మీ. వేగంతో పెను గాలులు వీస్తాయన్నది. ప్రధానంగా పూరీ, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపారా, భద్రక్ జిల్లాల్లో ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావం పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరప్రాంతాలపైనా ఉంటుందన్నది. దీంతో అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం 15 జిల్లాల ను అప్రమత్తం చేసింది. ఈ జిల్లాల్లో శుక్ర, శనివారాలు అన్ని విద్యాసంస్థలకు సెలవులి చ్చారు. సహాయ చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను తరలించారు. తుఫాన్‌పై ప్రధానమంత్రి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపిందని అధికారులు తెలిపారు. మరోవైపు, మహా తుఫాన్ గుజరాత్ తీరాన్ని తాకకుండానే అల్పపీడనంగా మారి అరేబియా సముద్రం వైపునకు తిరిగి వెళ్లిందని ఐఎండీ పేర్కొంది.

1989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles