బీహార్‌లో మరణమృదంగం


Mon,June 17, 2019 02:13 AM

Heat Wave Kills 14 in Gaya Death Toll Rises To 45 in Bihar

-వడదెబ్బతో 24 గంటల్లో 61 మంది మృత్యువాత
-93కి చేరిన ముజఫర్‌పూర్ చిన్నారుల మరణాలు
-రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం నితీశ్‌కుమార్

పాట్నా/ ముజఫర్‌పూర్, జూన్ 16: బీహార్‌లో మృత్యుఘోష కొనసాగుతున్నది. మెదడువాపు లక్షణాలతో ఓ వైపు చిన్నారులు మృత్యువాతపడుతుంటే.. మరోవైపు భానుడి భగభగలకు జనం పిట్టల్లా రాలుతున్నారు. ముజఫర్‌పూర్‌లో మెదడువాపుతో మృతిచెందిన చిన్నారుల సంఖ్య ఆదివారం నాటికి 93కి పెరిగింది. మరోవైపు వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 61 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మరణాల పట్ల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. విపత్తు నిర్వహణ కంట్రోల్ రూం వివరాల ప్రకారం.. ఒక్క ఔరంగాబాద్‌లోనే 30 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. గయాలో 20 మంది, నవాడా జిల్లాలో 11 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. శనివారం పాట్నాలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేండ్లలో జూన్ నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. గయాలో 45.2 డిగ్రీలు, భాగల్‌పూర్‌లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాట్నాలో పాఠశాలలను 19 వరకు మూసే ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.

కొనసాగుతున్న చిన్నారుల మరణాలు

ముజఫర్‌పూర్‌లో మెదడువాపు లక్షణాలతో మృతిచెందిన బాలల సంఖ్య ఆదివారం 93కి చేరుకుంది. శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్, దవాఖాన 79 మంది, కేజ్రీవాల్ దవాఖానలో 14 మంది మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, సహాయ మంత్రి అశ్విని చౌబే ఆదివారం ముజఫర్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బాధితుల బంధువుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. మెదడువాపు లక్షణాలతో జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఎస్‌కేఎంసీహెచ్‌లో 197 మంది, కేజ్రీవాల్ దవాఖానలో 91 మంది చేరారు.

206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles