హెచ్‌సీ గుప్తాకు మూడేండ్ల జైలు


Thu,December 6, 2018 02:13 AM

HC Gupta and 2 others sentenced to 3 year imprisonment

-బొగ్గు కుంభకోణంలో మరో ఇద్దరు అధికారులకు కూడా
-ముగ్గురు మాజీ అధికారులపై రూ.50 వేల జరిమానా, బెయిల్
-వీఎంపీఎల్ ఎండీ వికాస్ పాట్నీ, ప్రతినిధి మల్లిక్‌లకు నాలుగేండ్ల ఖైదు

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మాజీ సంయుక్త కార్యదర్శి కేఎస్ క్రోఫా, డైరెక్టర్ కేసీ సమ్రియాలకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మూడేండ్ల జైలుశిక్ష విధించింది. ఈ ముగ్గురికి రూ.50 వేల జరిమానా కూడా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. నాలుగేండ్లలోపు జైలుశిక్ష పడినందున వారికి జడ్జి భరత్ ప్రసార్ బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో వికాస్ మెటల్ అండ్ పవర లిమిటెడ్ (వీఎంపీఎల్) ఎండీ వికాశ్ పాట్నీ, ఆ సంస్థ ధ్రువీకృత ప్రతినిధిగా సంతకం చేసిన ఆనంద్ మల్లిక్‌లకు నాలుగేండ్ల చొప్పున జైలుశిక్ష విధించారు. వికాస్ పాట్నీకి రూ.25 లక్షలు, మల్లిక్‌పై రూ.2 లక్షలు, వీఎంపీఎల్ సంస్థపై రూ.లక్ష జరిమానా విధించారు. తీర్పు వెలువడిన వెంటనే దోషులందరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని పోలీసులను జడ్జి భరత్ ప్రసార్ ఆదేశించారు.

285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles