రాంపాల్ బాబా దోషి


Fri,October 12, 2018 01:33 AM

Haryana Self-styled godman Rampal found guilty in two murde cases

- ఇద్దరు మహిళల హత్యకేసుల్లో కోర్టు తీర్పు
-అతడి 26 మంది శిష్యులు కూడా... 16న శిక్షలు ఖరారు

హిస్సార్ (హర్యానా): అక్టోబర్ 11: ఇద్దరు మహిళల హత్యకేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న హర్యానాకు చెందిన బాబా రాంపాల్(67)కు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుల్లో రాంపాల్‌తోపాటు అతడి 26 మంది అనుచరుల్ని కోర్టు దోషులుగా నిర్థారించింది. ఇద్దరు మహిళల హత్య, వారిని ఆశ్రమంలో అక్రమంగా నిర్బంధించడం తదితర కేసుల్లో నిందితులపై మోపిన అభియోగాలు రుజువైనట్లు హిస్సార్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీఆర్ ఛాలియా గురువారం చెప్పారు. ఈ నెల 16, 17 తేదీల్లో నిందితులకు శిక్షను ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నాలుగేండ్లపాటు సుదీర్ఘంగా ఈ కేసు విచారణ జరిగింది. ఈ కేసుల్లో 2014, నవంబర్‌లో రాంపాల్‌తోపాటు అతడి అనుచరుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్నుంచీ హిస్సార్ జిల్లా జైలులోనే వారు ఉంటున్నారు. రాంపాల్‌పై కేసుల విచారణ సందర్భంగా హిస్సార్ జిల్లాలో భారీగా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. హర్యానాలోని హిస్సార్ జిల్లా బర్వాలాలో సత్‌లోక్ పేరుతో ఆశ్రమం ఏర్పాటుచేసిన బాబా రాంపాల్ తనకు తాను దేవుడి అవతారంగా ప్రచారం చేసుకుని ప్రాచుర్యం పొందాడు. ఆ తర్వాత పలు వివాదాల్లో కూరుకుపోయాడు. రాంపాల్ బాబా, అతడి శిష్యగణం తమ భార్యల్ని వారి ఆశ్రమంలో హత్యచేశారంటూ ఇద్దరు వ్యక్తులు 2014లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.


300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS