నేను పోటీచేయకపోవడం వెనుక..


Tue,April 16, 2019 11:21 AM

Hanuman Shivaji  Che Guevara behind my no to contesting polls

-హనుమాన్, శివాజీ, చే గువేరా
-నా జీవితంపై వీరి ప్రభావంగణనీయం
-కేంద్రమంత్రి ఉమాభారతి
ఝాన్సీ: ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయకూడదన్న తన నిర్ణయం వెనుక విప్లవకారుడు చే గువేరా, ఆంజనేయ స్వామి, శివాజీ ప్రభావం ఉన్నదని కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పారు. తన జీవితంపై వీరు ముగ్గురూ ఎంతో ప్రభావం చూపారన్నారు. చే గువేరా విజయం సాధించి.. క్యూబా నేత క్యాస్ట్రోకు తోడుగా ఉన్నారు. మరోదేశంలో తన అవసరం ఉందని గుర్తించి, అధికారాన్ని వదులుకుని ఆ దేశానికి వెళ్లి అక్కడే ప్రాణాలు విడిచా రు. ఆంజనేయస్వామీ ఇలానే. ఎన్నో యుద్ధా లు చేసిన ఆయన రాముడి పాదాల చెంతే ఉన్నారు అని అన్నారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ నుంచే తాను స్ఫూర్తి పొందానన్నారు.

ప్రస్తుతం ఆమె ఝాన్సీ స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ లో ఉన్న ఆయుర్వేద సంస్థ ఎండీ అనురాగ్ శర్మకు మద్దతుగా సోమవారం ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటే తనకు అభిమానమన్నారు. ప్రధానికి ఆదిత్యనాథ్ యువ రూపం (యంగర్ వెర్షన్) అని అభివర్ణించారు. గంగా ప్రక్షాళనకు ఈసారి తాను విరామం తీసుకుంటున్నానన్నారు. 2022లో పోటీచేసే విషయాన్ని కొట్టివేయలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత నేను బీజేపీ ఉపాధ్యక్షురాలినవుతానని అమిత్‌షా బహిరంగంగానే చెప్పారు. నాకిప్పుడు 59 ఏండ్లు. వచ్చే ఐదేండ్లు గంగా ప్రక్షాళనకు కేటాయించాలనుకుంటున్నా అని ఆమె తెలిపారు.

175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles