కొనసాగుతున్న గుజ్జర్ల ఆందోళన


Tue,February 12, 2019 02:22 AM

Gujjar agitation: Rajasthan CM Ashok Gehlot passes the buck to Centre

- నాలుగో రోజుకు చేరిన ఉద్యమం.. చర్చలకు సీఎం అశోక్ గెహ్లాట్ ఆహ్వానం
ఫిబ్రవరి 11: విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ రాజస్థాన్‌లో గుజ్జర్లు చేస్తున్న ఆందోళన సోమవారం నాలుగో రోజుకు చేరుకున్నది. ఆందోళనకారులు రైలు పట్టాలపై టెంట్లు వేసుకుని బైఠాయించడంతో సుమారు 300 రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. మరోవైపు ఆగ్రా-జైపూర్, జైపూర్-కోటా, ఎన్‌హెచ్-11 తదితర జాతీయ రహదారుల్ని గుజ్జర్లు దిగ్బంధించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గుజ్జర్ల నేత కిరోరిసింగ్ బైంస్లా సవాయ్ మాధోపూర్ జిల్లాలో తన అనుచరులతో కలిసి నాలుగు రోజులుగా రైలు పట్టాలపై ఆందోళన నిర్వహిస్తున్నారు. మరోవైపు గుజ్జర్లు తమ ఆందోళన విరమించి చర్చలకు రావాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో గుజ్జర్లకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చాలో వాటిని నెరవేరుస్తాం. కేంద్రం దృష్టికి ఈ డిమాండ్ తీసుకెళదాం. మీరు వెంటనే ఆందోళన విరమించి చర్చలకు రావాలి అని బైంస్లాను సీఎం కోరారు.

134
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles