ఎస్సీ, ఎస్టీ చట్టంపై రివ్యూ పిటిషన్


Sat,September 14, 2019 12:47 AM

Govt review plea in top court against SC and ST Act verdict goes to 3 judge Bench

- త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి మినహాయింపు ఇస్తూ సుప్రీంకోర్టు గతేడాది మార్చి 20న ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. జస్టిస్‌లు అరుణ్ మిశ్రా, యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. బెంచ్ వచ్చేవారం విచారణ జరుపుతుందని పేర్కొన్నది. అట్రాసిటీ చట్టం-1989 దుర్వినియోగమవుతున్నదంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపి.. కొన్ని నిబంధనలను మారుస్తూ గతేడాది తీర్పునిచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్రం రివ్యూ పిటిషన్ వేసింది.

82
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles