గూగుల్ కాపాడిన ప్రాణంTue,January 10, 2017 01:08 AM

బరేలి: ప్రియుడు పెండ్లికి నిరాకరించాడని మన స్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యే శరణ్యమనుకుంది. ఉత్తరప్రదేశ్‌లో సహరన్‌పూర్ సమీ పంలోని యమునానది కాలువ వద్దకు చేరుకుంది. కాలువలో దూకి తనువు చాలించుదామనుకుంది. కాలువ చివరలో నిలబడినప్పుడు ఆమెకు మరో ఆలోచన వచ్చింది. ఇంకా సులువుగా చావాలనుకుంది. తన దగ్గర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో ఆత్మహత్య చేసుకోవడం ఎలా అని గూగుల్‌లో సర్చ్ చేసింది. ఆత్మహత్యకు మార్గాలతోపాటు నివారణకు సంబంధించిన హెల్ప్‌లైన్ నం బర్లు సైతం వచ్చాయి. హెల్ప్‌లైన్ నంబర్లలో ఉన్న అక్కడి డీఐజీకి ఫోన్ చేసింది. ఆత్మహత్య చేసుకోవడం ద్వారా సాధించేది ఏమి లేదని డీఐజీ ఆ యువతికి వివరించారు. ఆత్మహత్యాయత్నం విరమించుకొని, కౌన్సెలింగ్‌కు వెళ్లేందుకు ఆమె అంగీకరించడంతో కథ సుఖాంతమైంది.

483
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS