వివరణ ఇవ్వాలి లేదా వైదొలగాలి


Thu,October 11, 2018 01:41 AM

Give satisfactory explanation or quit Congress to MJ Akbar

లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్ర మంత్రి అక్బర్‌ను డిమాండ్ చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ వివరణ ఇవ్వాలని లేదా తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ నాయకుడు జైపాల్‌రెడ్డి స్పందిస్తూ ఎంజే అక్బర్ తనకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలి లేదా మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఆయనపై వచ్చిన ఆరోపణల మీద దర్యాప్తు జరిపించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన కావెనా తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. మరి ఎంజే అక్బర్ ఎందుకివ్వరు? అని ప్రశ్నించారు.

బేటీ బచావో... అక్బర్ హఠావో.. : ఎంఐఎం

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ను వెంటనే పదవినుంచి తొలిగించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. మహిళలను వేధించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న అక్బర్ కేంద్ర మంత్రిగా కొనసాగడం తగదని ఒవైసీ అన్నారు.

628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles