14న ప్రధాని కానుకల వేలం


Thu,September 12, 2019 02:25 AM

Gifts given to PM to go under the hammer from September 14

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివిధ సందర్భాల్లో పలువురు అందించిన 2,772 కానుకలు, జ్ఞాపికలను ఈ నెల 14న ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నట్టు కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి ప్రహ్లాద్‌పటేల్ తెలిపారు. జ్ఞాపికల విలువ కనిష్ఠం రూ.200 నుంచి గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. గతంలోనూ ప్రధానికి లభించిన కానుకలకు వేలం నిర్వహించారు. 1,800కుపైగా కానుకలకు ఈ ఏడాది జనవరిలో 15 రోజులపాటు ఆన్‌లైన్ వేలం నిర్వహించినట్టు ప్రహ్లాద్ తెలిపారు. వేలం ద్వారా వచ్చిన నిధులను కేంద్ర ప్రభుత్వం గంగానదిని శుభ్రపరిచేందుకు తలపెట్టిన నమామి గంగే పథకానికి వెచ్చించినట్టు వెల్లడించారు.

1132
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles