గంగా ప్రక్షాళన కోసం 111 రోజులుగా దీక్షచేసిన అగర్వాల్ కన్నుమూత


Fri,October 12, 2018 01:35 AM

Ganga crusader GD Agarwal dies

డెహ్రాడూన్: గంగానది ప్రక్షాళన కోసం 111 రోజులుగా నిరాహార దీక్షచేస్తున్న పర్యావరణవేత్త, ఐఐటీ మాజీ ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ అలియాస్ జ్ఞాన్‌స్వరూప్ సనంద్ (87) గురువారం హరిద్వార్‌లో కన్నుమూశారు. తన మాత్రి సదన్ ఆశ్రమంలో జూన్ 22 నుంచి నిరాహార దీక్షకు దిగిన అగర్వాల్‌ను బుధవారం ఉత్తరాఖండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రిషికేశ్‌లోని ఎయిమ్స్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హిందువులు పవిత్రంగా భావించే గంగానదిని పరిశుభ్రపరుచాలని డిమాండ్ చేస్తూ ఆయన పలుమార్లు దీక్షలు చేపట్టారు. ప్రస్తుత దీక్ష ఆరోవది. అగర్వాల్ మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఆయన డిమాండ్లలో చాలావాటిని అంగీకరించామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. గంగాప్రక్షాళన కోసం దీక్షచేస్తూ చనిపోయిన వారిలో అగర్వాల్ రెండోవారు. గతంలో రెండు నెలలకుపైగా నిరాహారదీక్ష చేసిన స్వామినిగమానంద్ (36) 2011లో ప్రాణాలు కోల్పోయారు.

1489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles