జనమే జనం!


Thu,July 12, 2018 07:43 AM

From Delhi To Vatican Around The World In Numbers

-రాకెట్ వేగంతో పెరుగుతున్న జనాభా
-2017 నాటికి ప్రపంచ జనాభా 760 కోట్లు
-2050 నాటికి 980 కోట్లకు చేరువ

న్యూఢిల్లీ: ప్రపంచ జనాభా రాకెట్ వేగంతో పెరిగిపోతున్నది. 2017 నాటికి మొత్తం జనాభా 760 కోట్లు. ఇదే స్థాయిలో పెరుగుదల నమోదైతే 2050 నాటికి ప్రపంచంలో జనాభా 980 కోట్లకు చేరుతుందని నిపుణుల అంచనా. ఈ నెల 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐరాస ఇటీవల విడుదల చేసిన నివేదికలోని అంశాలు ఆసక్తిని రేకిస్తున్నాయి. గత 12 ఏండ్లలోనే ప్రపంచ జనాభాకు మరో 100 కోట్ల మం ది జతకలిశారని ఈ నివేదిక తెలిపింది. ఇందులో 60 శాతం (450 కోట్లు) కేవలం ఆసియా ఖండంలోనే నివసిస్తుండగా.. ఆఫ్రికా, ఐరోపా ఖండాలు రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. 1950 నుంచి ఇప్పటివరకు దాదాపు మూడింతలైన ప్రపంచ జనాభా.. మరింత వేగంతో దూసుకెళ్తున్నది.

ఇప్పటినుంచి 2050 మధ్యలో పెరిగే జనాభాలో దాదాపు సగం కేవలం పది దేశాల నుంచే ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ పది దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉన్నది. తర్వాతీ స్థా నాల్లో నైజీరియా, కాంగో, పాకిస్థాన్, ఇథియోపియా, టాంజానియా, అమెరికా, ఉగాండా, ఇండోనేషియా, ఈజిప్ట్ నిలుస్తా యి. 2050కల్లా జనాభాలో భారత్ అగ్రస్థానంలో ఉంటే.. నైజీరియా అమెరికాను వెనుకకు నెట్టి ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా ఉంటుందని నిపుణులంటున్నారు.

వృద్ధుల సంఖ్య కూడా ఘనమే!: క్షీణిస్తున్న సంతానోత్పత్తి, అత్యధిక జీవన ప్రమాణాలతో వృద్ధుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని ఐరాస చెబుతున్నది. 2017 లెక్కల ప్రకారం ప్ర పంచ జనాభాలో 13 శాతం మంది 60 ఏండ్లు దాటిన వారై తే.. 2100 నాటికి ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మంది వృద్ధులే ఉంటారు. 2100 నాటికి 0-14 ఏండ్ల పిల్ల ల విషయంలో ప్రపంచం తిరోగమిస్తుందని నిపుణు లు హెచ్చరిస్తున్నారు. నాటికి వృద్ధుల జనాభా కంటే 14 ఏండ్ల లోపు పిల్లల జనాభా తక్కువగా కానున్నది.

12 పెద్ద దేశాల జనాభాకు భారత్ సమానం!

జనాభాపరంగా 12 భారీ దేశాల జనాభాను ఒక్క భారత్ తనలో ఇముడ్చుకోగలదు. 2016లో భారత్ జనాభా 127 కోట్లు. చైనా మినహా వైశాల్యంలో అతిపెద్దవైన 12 దేశాల జనాభాకు దాదాపు సమానం. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ర్టాల జనాభా అమెరికా జనాభాకు సమానమైతే, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ర్టాల జనాభా రష్యా జనాభా అంత ఉంటుంది.

733
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles