వీడనున్న పంచరత్నాల బంధం

Fri,November 8, 2019 01:52 AM

-కేరళలో ఐదుగురు కవలల్లో నలుగురు యువతులకు ఒకే రోజు పెండ్లి

తిరువనంతపురం: అమ్మ కడుపున ఒకేసారి పుట్టిన ఐదుగురు కవలల 24 ఏండ్ల నాటి జన్మ బంధం కొన్ని నెలల్లో వీడనున్నది. వీరిలో నలుగురు యువతులకు వచ్చే ఏడాది ఏప్రిల్ 26న పెండ్లి జరుగనున్నది. కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఓ దంపతులకు 1995 నవంబర్ 18న ఐదుగురు కవల పిల్లలు జన్మించారు. వీరిలో నలుగురు ఆడ పిల్లలు కాగా ఒక మగ శిశువు. కేరళలో నాడు ఇదో సంచలనం. మళయాలం క్యాలండర్ ప్రకారం ఉత్తర నక్షత్రం లో పుట్టిన ఐదుగురు సంతానానికి ఉత్రజ, ఉత్తర, ఉత్తమ, ఊత్ర, ఉత్రాజన్ అని పేర్లు పెట్టారు. ఆ తండ్రి తన ఇంటికి పంచ రత్న నిలయంగా నామకరణం చేశాడు. 2004లో తండ్రి ఆత్మహత్య చేసుకోగా, తల్లి గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నది. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ప్రభుత్వం ఆ తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ప్రభుత్వం అండతో ఐదుగురు ఉన్నత చదువులు చదివారు. ఆడబిడ్డల్లో ఒకరు ఫ్యాషన్ డిజైనర్‌కాగా ఇద్దరు అనస్థిషియా టెక్నీషియన్లుగా, ఒకరు ఆన్‌లైన్ రైటర్‌గా, ఉత్రాజన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఐదుగురికి ఈ నెల 18తో వారికి 24 ఏండ్లు నిండనున్నాయి. వీరిలో నలుగురు ఆడపిల్లలకు పెండ్లి నిశ్చయమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 26న గురువాయర్‌లో పెండ్లి చేయనున్నట్లు తల్లి తెలిపారు.

11671
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles