మంచుచరియలు విరిగిపడి నలుగురు జవాన్ల దుర్మరణం

Thu,December 5, 2019 01:22 AM

శ్రీనగర్: ఉత్తర కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో రెండుచోట్ల మంచుచరియలు విరిగిపడి నలుగురు జవాన్లు దుర్మరణం చెందారు. అధికారుల సమాచారం మేరకు.. కుప్వారా జిల్లాలోని తాంగ్‌ధర్ ప్రాంత ఆర్మీ పోస్ట్‌పై మంగళవారం మధ్యాహ్నం మంచుచరియలు విరిగిపడగా నలుగురు జవాన్లు చిక్కుకుపోయారు. వారిలో ఒక జవాన్‌ను ప్రాణాలతో కాపాడగా, మిగతా ముగ్గురి మృతదేహాలను బుధవారం వెలికితీశారు. మరో ఘటన బందీపోరా జిల్లాలో జరిగింది. గురెజ్ సెక్టార్‌లోని దావర్ ప్రాంతంలో పహారా కాస్తున్న ఇద్దరు జవాన్లపై మంచుచరియలు విరిగిపడ్డాయి. వెంటనే గాలింపు చర్యలు చేపట్టి ఒక జవాన్ ప్రాణాలు కాపాడామని, మరొకరి మృతదేహాన్ని వెలికితీశామని అధికారులు తెలిపారు.

350
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles