హిమాచల్‌లో జై జవాన్!


Thu,March 21, 2019 02:54 AM

Former soldiers who are politically afflicted with jawans sacrifices

- 4 లోక్‌సభ స్థానాలు
- 50 లక్షలు మొత్తం ఓటర్లు
- 2,50,000 సైనికులు, మాజీ సైనికులు
- లక్షిత, వైమానిక దాడులపై బీజేపీ ప్రచారం
- 1971 యుద్ధాన్ని గుర్తు చేస్తున్న కాంగ్రెస్
- జవాన్ల త్యాగాలతో రాజకీయం తగదంటున్న మాజీ సైనికులు

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో జాతీయ భద్రత అంశమే ప్రధాన ఎన్నికల అస్త్రంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలోని ఓటర్లలో మాజీ సైనికులు, ప్రస్తుతం సైన్యంలో పని చేస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉండటమే దీనికి కారణం. రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో కంగ్రా, హమీర్‌పూర్, మండీలో విజయావకాశాలను వీరు ప్రభావితం చేయనున్నారు. మొత్తం 50 లక్షల మంది ఓటర్లలో 2.5 లక్షల మంది మాజీ సైనికులు, ప్రస్తుతం సైనిక బలగాల్లో పని చేస్తున్న వారే. 1.30 లక్షల మంది మాజీ సైనికులు కాగా, 1.20 లక్షల మంది జవాన్లు ఉన్నారు. బీజేపీ 2016లో జరిగిన లక్షిత (సర్జికల్ ైస్ట్రెక్స్) దాడులు, తాజాగా పాక్‌లోని బాలాకోట్‌లో జైషే శిబిరంపై జరిపిన వాయుసేన దాడులను బహిరంగ సభల్లో లేవనెత్తుతున్నది.

మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ అవతరణకు చేసిన కృషిని గుర్తుచేస్తున్నది. ప్రధాని మోదీ చేతుల్లోనే దేశానికి పూర్తి భద్రత ఉందని రాష్ట్రంలో బీజేపీ సర్కార్‌కు సారథ్యం వహిస్తున్న సీఎం జైరాంఠాకూర్ పేర్కొన్నారు. యురి సెక్టార్‌లోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ప్రధాని మోదీ సమర్థ నాయకత్వంలో సైన్యం లక్షిత దాడులు చేసింది అని మండీలో జరిగిన సభలో జైరామ్ ఠాకూర్ చెప్పారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లలో తిలక్‌రాజ్ స్థానిక కంగ్రా వాసే. ఈ నేపథ్యంలోనే వైమానిక దాడుల ద్వారా పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం అని గుర్తు చేశారు. 2008 ముంబై దాడుల తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని జైరాం ఠాకూర్ ఆరోపించారు.

అయితే జవాన్ల త్యాగాలతో రాజకీయాలు చేయడంపై కాంగ్రెస్ నేత ముకేశ్ అగ్నిహోత్రి తీవ్ర అభ్యంతరం తెలిపారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా వైమానిక దాడులు జరిపినందుకు ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు జాతీయ భద్రతే ప్రథమ ప్రాధాన్యం. నూతన దేశంగా బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కేంద్రంలో 1971లో ఇందిరాగాంధీ సారథ్యంలోని నాటి కేంద్ర ప్రభుత్వం, మన సైన్యం చేసిన కృషిని బీజేపీ నేతలు మరిచిపోవద్దు అని చెప్పారు. రిటైర్డ్ బ్రిగేడియర్ కుషాల్ ఠాకూర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సైనిక బలగాలు కార్గిల్ యుద్ధ సమయంలో, తాజాగా లక్షిత దాడులు, వైమానిక దాడుల సమయంలోనూ, తీవ్రవాదానికి వ్యతిరేకంగా అంకిత భావంతోనూ, సాహసోపేతంగా విధులు నిర్వర్తించారన్నారు. ప్రభుత్వాల నిర్ణయానికి అనుగుణంగా సైనిక బలగాలు పని చేశాయని, అయితే జవాన్ల త్యాగాల పేరిట రాజకీయాలు చేయడం సబబు కాదన్నారు.

299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles