రాజ్యసభకు మన్మోహన్ ఏకగ్రీవ ఎన్నిక


Tue,August 20, 2019 02:24 AM

Former PM Manmohan Singh Elected Unopposed to Rajya Sabha from Rajasthan

-రాజస్థాన్ నుంచి ఎన్నికైన మాజీ ప్రధాన మంత్రి
-అసోం నుంచి1991-2019 మధ్య మన్మోహన్ ప్రాతినిధ్యం

జైపూర్, ఆగస్టు 19: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంతకుముందు ఆయ న 1991- 2019 మధ్య దాదాపు 3 దశాబ్దాలు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతిని ధ్యం వహించారు. ఈ దఫా ఆ అసోం నుంచి అవకాశం లేకపోవడంతో రాజస్థాన్ నుంచి పోటీచేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు గడు వు ముగిశాక రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి ప్రమీల్ కుమార్ మాథూర్ ఒక ప్రకటనలో మన్మోహన్‌సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. రాజ్యసభకు ఎన్నికైనందుకు మన్మోహన్ సింగ్‌కు రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ అభినందనలు తెలిపారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అభినందనలు.

ఆయన ఎన్నిక రాష్ర్టానికి గర్వకారణం. ఆయన పరిజ్ఞానం, అనుభవం నుం చి రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరనుంది అని గెహ్లాట్ ట్వీట్‌చేశారు. మన్మోహన్ సింగ్ తరఫున రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నికల ధ్రు వీకరణ పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ మహేష్ జోషి స్వీకరించారు. రాజ్యసభ ఎంపీ మదన్‌లాల్ సైనీ మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మన్మోహన్ సింగ్ అభ్యర్థిత్వాన్ని కాం గ్రెస్ ఖరారుచేసింది. మరోవైపు ఈ ఎన్నికలో పోటీ చేయరాదని బీజేపీ నిర్ణయించింది. ఈ నెల 13న మాజీ ప్రధాని నామినేషన్ దాఖలుచేశారు. దాదాపు మూడు దశాబ్దాలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్ సింగ్ 2004- 14 మధ్య రెండు దఫాలు దేశ ప్రధానిగా సేవలందించారు. ఈ ఏడాది జూన్ 14తో రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం ముగిసింది. అసోం నుంచి రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్‌కు సరిపడా బలం లేకపోగా, ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా ఖాళీలు లేవు.

591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles