బీహార్ చివరి కాంగ్రెస్ సీఎం జగన్నాథ్ మిశ్రా కన్నుమూత


Tue,August 20, 2019 02:18 AM

Former Bihar CM Jagannath Mishra passes away

న్యూఢిల్లీ, ఆగస్టు 19: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా(82) కన్నుమూశారు. గత కొన్నేండ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జగన్నాథ్ మిశ్రా భార్య గత ఏడాది చనిపోయారు. వారికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. చివరి కుమారుడు నితీశ్ మిశ్రా బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. బీహార్ రాజకీయాల్లో డాక్టర్ సాహేబ్‌గా పేరుగాంచిన జగన్నాథ్ మిశ్రా కాంగ్రెస్ పార్టీ తరుఫున మూడుసార్లు సీఎం పదవి (1975-90 మధ్య కాలంలో) చేపట్టారు. ఆ రాష్ర్టానికి చివరి కాంగ్రెస్ సీఎం కూడా ఆయనే. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, బీహార్ సీఎం నితీశ్‌తోపాటు పలువురు సంతాపం తెలిపారు. బీహార్ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది.

289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles