రాజకీయ రంగు పడుద్ది!


Thu,March 21, 2019 02:17 AM

Flags colours of major parties on the market

-మార్కెట్‌లో ప్రధాన పార్టీల జెండాల రంగులు
-ముఖ్యనేతల బొమ్మలతో కూడిన స్ప్రే వస్తువులు

సార్వత్రిక ఎన్నికల వేళ హోలీ పండుగ వచ్చింది. ఈ ఎన్నికల సమయంలో అన్నీ రాజకీయంలో భాగమే కానున్నాయి. పండుగలు కూడా.. ఈ ఏడాది హోలీ పండుగకు ఉత్తరప్రదేశ్ రాజకీయాలు సరికొత్త రంగులద్దుకోనున్నాయి. హోలీకి సంబంధించిన సరుకులన్నీ ఇప్పటికే రాజకీయ కోణంలో మార్కెట్లోకి వచ్చేశాయి. ఆగ్రా, మధురతోపాటు ఇతర జిల్లాల్లో రాజకీయ నాయకుల బొమ్మలతో కూడిన హోలీకి సంబంధిత రంగులు, స్ప్రే చేసే వస్తువులను భారీగా విక్రయిస్తున్నారు. పలు ప్రధాన పార్టీల జెండాలకు సంబంధించిన రంగులకు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. రంగులు పిచికారీ చేసే వస్తువులపై ప్రియాంకా గాంధీ, అఖిలేశ్ యాదవ్, మోదీ బొమ్మలు ముద్రించి విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఆయా పార్టీల జెండాలకు సంబంధించిన రంగులకు ఇక్కడి మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నది. కాంగ్రెస్‌కు ముదురు ఆకుపచ్చ, బీజేపీకి కాషాయ రంగు, ఎస్పీ, బీఎస్పీకి నీలం రంగులు ఇలా పార్టీల జెండాలకు సంబంధించిన రంగులను మార్కెట్లో విక్రయిస్తున్నారు.

ఆయా పార్టీల అభిమానులు, ఈ రంగులను కొనుగోలు చేస్తున్నారు. ఈ సంవత్సరం రాజకీయ పార్టీల రంగులకు బాగా డిమాండ్ ఉన్నదని ఆగ్రాలోని బోడ్ల ప్రాంతానికి చెందిన హోలీ సరుకుల హోల్‌సేల్ వ్యాపారి రమేశ్ అగర్వాల్ చెప్తున్నారు. చాలామంది యువతులు ప్రియాంకా గాంధీ బొమ్మ ముద్రించి ఉన్న స్ప్రే వస్తువుల్ని, యువకులు మోదీ, యోగీ బొమ్మ ముద్రించి ఉన్న స్ప్రే వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారని రమేశ్ అగర్వాల్ చెప్తున్నారు. మోదీ, యోగీ, రాహుల్, ప్రియాంకా బొమ్మలు ముద్రించి ఉన్న స్ప్రే వస్తువులు రూ.50 నుంచి రూ.200 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా పార్టీ నాయకుల ఫొటోలు ముద్రించి ఉన్న రంగు రంగుల బెలూన్లకు కూడా భలే డిమాండ్ ఉన్నదని ఓ చిరు వ్యాపారి వినీత్ గోయల్ చెప్తున్నారు. ఈ ఏడాది ప్రజలు తమ రాజకీయ అభిమానాన్ని చాటుకునేలా హోలీని జరుపుకొంటున్నా రు. నేతల మాస్క్‌లకు కూడా భలే డిమాండ్ ఉన్నది అని ఓ వ్యాపారి చెప్పారు.

235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles