243 మంది ఏమైనట్టు?


Mon,June 17, 2019 01:43 AM

Five Months On Families Of 243 People Still Wait For Them Since They Went Missing From Kerala

-పడవలో అక్రమ ప్రయాణం
-జనవరిలో అదృశ్యం
- బంధువుల ఆందోళన

న్యూఢిల్లీ: వెళ్లొచ్చాక.. మళ్లీ మిమ్మల్ని తిరిగి తీసుకెళ్తాంఅన్న వారి మాటలు ఆత్మీయుల చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి. కానీ, వారి నుంచి ఐదు నెలలు గడిచినా పిలుపు రాలేదు. అసలు ఉన్నారో, లేరోనన్న మీ మాంస గల్లంతైన వారి బంధువుల ముఖాల్లో కనబడుతున్నది. ఒకరు కాదు, ఇద్దరు కాదు 243 మంది జాడ గురించి అంతుచిక్కని ప్రశ్న వాళ్ళను రోజూ వేధిస్తున్నది. గత జనవరి 12న కేరళలోని ఎర్నాకుళం నుంచి ఓ పెద్ద చేపల బోటులో అక్రమంగా విదేశాలకు బయలుదేరిన వీరు ఏమయ్యారన్నది.. ఇటు ప్రభుత్వం, అటు మానవహక్కుల సంఘాలు స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి. వారిలో 184 మంది ఢిల్లీలోని అంబేద్కర్ నగర్ వాళ్లే. విలాస జీవితంపై ఆశతో తమిళనాడు, కేరళ రాష్ర్టాల వాసులతో కలిసి విదేశాలకెళ్లిన వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో వారి ఆత్మీయులు కేంద్ర హోం, విదేశాంగ శాఖ, మానవహక్కుల సంఘాలను ఆశ్రయించినా లాభం లేకపోయింది. కాగా, జనవరి 11న కొచ్చి సమీపంలోని మునంబం తీరం లో కేరళ పోలీసులు 50 బ్యాగులను గుర్తించారు. మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అనుమానంతో 10 మందిని అరెస్టు చేశారు. వారిని విచారించినా తప్పిపోయిన వారి జాడ తెలియలేదు. ఢిల్లీ నుంచి వెళ్లిన 184 మందిపై ఇంటర్‌పోల్ బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసినా ప్రయోజనం లేదు.

855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles