నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం


Thu,January 10, 2019 12:44 AM

Fire in a building in the structure

-ముగ్గురి పరిస్థితి విషమం
-మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరం కింగ్స్‌వే రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల దవాఖానలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే 10 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు పూనుకున్నాయి. రెండో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తున్నది. ప్రమాద సమయంలో భవనం లోపల సుమారు 200 మంది కార్మికులు చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. భవనంలో చిక్కుకున్న వారిలో ఏడుగురిని అగ్నిమాపక సిబ్బంది బయటకు వెలికి తీశారు. ప్రమాదానికి షార్ట్ సర్యూట్ కారణమని తెలుస్తున్నది.

123
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles