నోటర్‌డామ్ చర్చిలో భారీ అగ్నిప్రమాదం


Tue,April 16, 2019 01:53 AM

Fire at Notre Dame Cathedral in Paris

పారిస్‌లోని చారిత్రక నోటర్‌డామ్ కెథడ్రల్ చర్చిలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చర్చి పైకప్పు, గోపుర భాగం పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయి. గోతిక్ శైలిలో నిర్మించిన కెథడ్రల్ గోపురం నుంచి పొగ, మంటలు ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. ఈ గోపురాన్ని చూసేందుకే ఏటా లక్షలాది మంది పర్యాటకులు పారిస్‌కు వస్తుంటారు. కడపటివార్తలు అందేసమయానికి అగ్నిమాపకశాఖ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చర్చిలోపల పైకప్పు కింది భాగంలో ఉన్న కలప నిర్మాణాలకు మంటలు అంటుకోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని చర్చి అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో చర్చిలో మరమ్మతు పనులు జరుగుతున్నాయని.. అదీ ఒక కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

120
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles