చదువుకుంటానంటే చంపబోయాడు


Mon,June 17, 2019 02:07 AM

Father brother attempt to kill 15 year old throw her in canal because she wanted to study

-యూపీలో కూతురిపై తండ్రి హత్యాయత్నం.. సహకరించిన సోదరుడు
షాజహాన్‌పూర్, జూన్ 16: నాకు పెండ్లి వద్దు. చదువుకుంటానన్న కూతురిపై కొడుకుతో కలిసి కన్న తండ్రే విచక్షణా రహితంగా దాడిచేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జరిగింది. ఈ విషయాన్ని 15 ఏండ్ల బాలిక స్వయంగా పోలీసులకు తెలిపింది. నేను పెండ్లి చేసుకోను. చదువుకుంటానంటే నాన్న ఒప్పుకోలేదు. ఆయన నన్ను నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. నా సోదరుడు కూడా అక్కడకు వచ్చాడు. కదలకుండా మెడపై గుడ్డను చుట్టి నన్ను నా సోదరుడు గట్టిగా పట్టుకోగా.. నాన్న నన్ను కత్తితో పలుమార్లు పొడిచాడు.

ఆతరువాత నన్ను పక్కనే ఉన్న కాలువలో పడేసి ఇద్దరూ వెళ్లిపోయారు అంటూ బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. కూతురు బతికుందో లేదో తెలుసుకోవడానికి కాసేపటి తరువాత తన తండ్రి మళ్లీ అక్కడికి వచ్చాడని, తండ్రి కంటపడితే ప్రమాదం అనుకున్న తాను కాలువలో మరి కొంతదూరం ఈదుకుంటూ వెళ్లి దాక్కున్నానని వెల్లడించింది. కాగా బాలిక చెప్పిన విషయాలు నిజమేనని ఆమె సోదరి భర్త సైతం పోలీసులకు తెలిపారు. ఆమె గత రెండు నెలలుగా మాతోనే ఉంటున్నది. ఆమె చదువుకోవటం తండ్రీ, కొడుకలకు ఇష్టంలేదు. రెండు రోజుల క్రితం పెండ్లి చేస్తానంటూ ఆమెను వాళ్లు మా ఇంటి నుంచి తీసుకెళ్లిపోయారు. ఆమె కాలువ దగ్గర పడి ఉందంటూ ఫోన్ రావటంతో నేను వెంటనే అక్కడికి వెళ్లాను అని ఆయన పోలీసులకు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు.

918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles