విధి లైంగికదాడిలాంటిది

Wed,October 23, 2019 01:44 AM

-ప్రతిఘటించలేనప్పుడు.. ఆస్వాదించాలి
-కేరళ కాంగ్రెస్ ఎంపీ భార్య వివాదాస్పద వ్యాఖ్యలు

తిరువనంతపురం: విధి లైంగికదాడిలాంటిది అంటూ కేరళలోని ఎర్నాకుళం కాంగ్రెస్ ఎంపీ హిబి ఈడెన్ భార్య అన్నా లిండా ఈడెన్ ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.విధి లైంగికదాడి లాంటిది. ఒకవేళ దాన్ని నువ్వు ప్రతిఘటించకపోతే.. అప్పుడు ఆస్వాదించేందుకు ప్రయత్నించు అని పేర్కొంటూ.. అన్నాలిండా ఫేస్‌బుక్‌లో రెండు వీడియోలను సోమవారం షేర్ చేశారు. ఇందులో భారీ వర్షాలకు సోమవారం కొచ్చిలోని ఇంటి చుట్టూ వరదనీరు చేరడంతో తమ కూతురును రబ్బరుబోటులో తరలిస్తున్న దృశ్యం ఒకటికాగా, తన భర్త హిబి ఈడెన్ ఆహారం తింటున్న దృశ్యం రెండోది. ఆ వీడియోలకు ఆమె పెట్టిన క్యాప్షన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై అన్నా లిండా మంగళవారం స్పందించారు. లైంగికదాడులను కీర్తించాలన్నది తన ఉద్దేశంకాదని స్పష్టంచేశారు. మహిళలను అగౌరవపరచాలన్నది నా ఉద్దేశం కాదు అన్నారు. సోమవారం చేసిన పోస్ట్‌లను తొలగించారు.

1459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles