మరుగుదొడ్డే ఇల్లు !


Sun,May 19, 2019 02:28 AM

Fani razes house Odisha family makes Swachh Bharat toilet his home

-ఒడిశాలో ఓ దళిత కుటుంబంపై ఫొని తుఫాన్ దెబ్బ
కేంద్రపారా: ఫొని తుఫాన్ విలయ తాండవం ఒడిశాలో అపార నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆ తుఫాన్‌ధాటికి ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లా రగుదేయిపూర్ గ్రామంలో ని ఓ దళిత కుటుంబానికి తుఫాన్ గాయం ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నది. ఖిరోడ్ జేనా (58) అనే రోజువారీ కూలీపని చేసుకునే వ్యక్తి పూరిల్లును మే 3న ఫొని తుఫాన్ నేలమట్టం చేసిం ది. మరో ఇంటిని అద్దెకు తీసుకొనే తాహతులేని ఖిరోడ్ కుటుంబంతో సహా తన మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్నాడు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ పథకం కింద ఏడడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పు గల పక్కామరుగుదొడ్డి రెండేండ్ల క్రితం ఇతనికి మంజూరైంది. గాలులకు ఇల్లు కోల్పోయినా, ప్రభుత్వం కట్టించిన పక్కా మరుగుదొడ్డి మాత్రం మిగిలిందని, మరో ఇంటికి మారే తాహతులేక ఇందులోనే భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటున్నానని ఖిరోడ్ వాపోయాడు. ఎంతకాలం ఈ మరుగుదొడ్లో ఉంటామో తెలియదు.

తుఫాన్ గాలులకు నా పూరిల్లు కొట్టుకుపోయింది. పక్కా మరుగుదొడ్డే మిగిలింది. మళ్లీ ఇల్లు కట్టుకోవడానికి నా వద్ద సొమ్ము లేదు. తుఫాన్ నిరాశ్రయులకు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడడం తప్ప నేను ఏమీ చేయలేను. మరుగుదొడ్లో ఉండటంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటికి వెళ్లాల్సి వస్తుంది అని ఖిరోడ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై), బిజూ పక్కా ఘర్ పథకం కింద తాను పక్కా ఇంటికి దరఖాస్తు చేసినా, అధికారులు మంజూరు చేయలేదని, ఒకవేళ ప్రభుత్వం పక్కా ఇంటిని తనకు మంజూరు చేస్తే, ఇప్పు డు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నాడు. ఖిరోడ్ కుటుంబం మరుగుదొడ్లో నివాసం ఉంటున్న సంగతి తమ దృష్టికి వచ్చిందని, తుఫాన్ పరిహారంతోపాటు, గృహ నిర్మాణ పథకం కింద నిధులను త్వరలో అతనికి అందజేస్తామని పట్టణాభివృద్ధి శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ఫరీదా చెప్పారు.

497
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles