బోఫోర్స్‌కుంభకోణంపై ఫెయిర్‌ఫాక్స్Thu,October 19, 2017 12:38 AM

ఆరోపణలు పరిశీలిస్తాం: సీబీఐ

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: బోఫోర్స్ కుంభకోణంపై ప్రైవేట్ గూఢచారి మైఖేల్ హెర్ష్‌మామ్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవాలను పరిశీలించనున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తెలిపింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఫెయిర్‌ఫాక్స్ అనే ప్రైవేట్ గూఢచార సంస్థ అధ్యక్షుడైన మైఖేల్ హెర్ష్‌మామ్ వారం క్రితం జరిగిన ప్రైవేట్ గూఢచారుల సదస్సులో మాట్లాడుతూ బోఫోర్స్ కుంభకోణంలో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీకి అందిన ముడుపులను స్విస్ బ్యాంకు ఖాతా మోంట్ బ్లాంక్‌లో జమ చేసినట్లు కనుగొన్నట్లు చెప్పారు. స్విస్‌బ్యాంక్‌లో ఖాతా విషయమై తమకు సమాచారం అందిందని తెలియడంతో రాజీవ్‌గాంధీ కలత చెందారని, తర్వాత దర్యాప్తును అడ్డుకున్నారని టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మైఖేల్ హెర్ష్‌మామ్ తెలిపారని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ఇంటర్వ్యూల్లో వాస్తవాలను పరిశీలిస్తామని తెలిపారు. ఈ కేసులో భారత దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు సిద్ధమని మైఖేల్ హెర్ష్‌మామ్ ఆ ఇంటర్వ్యూల్లో చెప్పారు.

151

More News

VIRAL NEWS