పాక్‌లో మైనారిటీలకు రక్షణ లేదు


Wed,September 11, 2019 02:12 AM

Ex-MLA From Imran Khan's Party In India Requests PM Modi For Asylum

- పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ మాజీ ఎమ్మెల్యే బల్‌దేవ్ కుమార్ ఆవేదన
- భారత్‌లో ఆశ్రయం కల్పించాలని మోదీకి విజ్ఞప్తి


చండీగఢ్, సెప్టెంబర్ 10: ఉగ్రవాదానికి పాకిస్థాన్ సహకారం అందిస్తున్నదని, అక్కడ మైనారిటీలపై మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బల్‌దేవ్ కుమార్ ఆరోపించారు. భారత్‌లో తమకు ఆశ్రయం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన కోరారు. బల్‌దేవ్, ఆయన భార్య, వారి ఇద్దరు పిల్లలు గత నెలలో భారత్ చేరుకున్నారు. ప్రస్తుతం పంజాబ్‌లోని లూథియానా జిల్లా ఖన్నా ప్రాంతంలో వాళ్లు నివసిస్తున్నారు. మంగళవారం బల్‌దేవ్ మీడియాతో మాట్లాడారు. భారత్‌ను ఆశ్రయం కోరేందుకు నేను ఇక్కడికి వచ్చాను. మాకు సాయం చేయమని ప్రధాని నరేంద్ర మోదీని అర్థిస్తున్నాను అని అన్నారు. మీరెందుకు పాక్‌ను విడిచిపెట్టి వచ్చారన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. పాకిస్థాన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను యావత్ ప్రపంచం చూస్తున్నది.

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గద్దెనెక్కినప్పటినుంచి దేశంలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇమ్రాన్ నూతన పాకిస్థాన్ అంటూ ఎప్పుడూ మాట్లాడుతుంటారు. అయితే, కొత్త పాకిస్థాన్ కంటే మునపటి పాక్ చాలా మెరుగ్గా ఉండేది. పాక్‌ను అభివృద్ధి చేయడంలో, మైనారిటీల హక్కులను కాపాడటంలో ఇమ్రాన్ పూర్తిగా విఫలమయ్యారు అని అన్నారు. ఉగ్రవాదానికి పాక్ సహకారంపై మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఉగ్రవాదానికి సహకారం అందిస్తున్నది. ఇది నిజం. తన సొంత ఇంటిని చూసుకోలేని దేశం(పాకిస్థాన్) ఇతర దేశాలపై వేలెత్తి చూపిస్తున్నది అని మండిపడ్డారు. కర్తార్‌పూర్ గురుద్వారా నిర్మాణం కోసం విదేశాల్లోని సిక్కులు ఇచ్చిన విరాళాలు పక్కదారి పట్టాయని ఆయన ఆరోపించారు.

294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles