రాసింది పది.. పాసైంది ఇంటర్ !Sat,May 20, 2017 01:50 AM

omprakash
-మరో వివాదంలో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా
న్యూఢిల్లీ: ఎవరైనా పదో తరగతి పరీక్షలు రాస్తే.. ఇంటర్ పాసవుతారా. అదీ ఏ గ్రేడ్‌లో. మిగిలిన వారి సంగతి ఏమో కానీ హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా మాత్రం పాసయ్యారట. జాతీయ సార్వత్రిక పాఠశాల (ఎన్‌ఐవోఎస్)లో పదో తరగతి పరీక్షలు రాసిన ఆయన ఇంటర్ ఏ గ్రేడ్‌లో పాసైనట్టు ప్రకటించుకున్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఎన్‌ఐవోఎస్ పది, ఇం టర్ ఫలితాలు ఇంకా వెలువడలేదు. హర్యానాలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో చౌతాలా దోషిగా తేలడంతో పదేండ్ల శిక్ష పడింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

తన తండ్రి తీహార్ జైలులో ఏర్పాటుచేసిన పరీక్ష కేం ద్రంలో గత నెల ఎన్‌ఐఓస్ ఇంటర్ పరీక్షలు రాసి పాసయ్యారని, 82 ఏండ్ల వయసులోనూ ఏ గ్రేడ్ సాధించారని చౌతాలా కొడుకు అభయ్ సింగ్ ఇటీవలే మీడియాకు వెల్లడించారు. అయితే చౌతాలా అడ్మిషన్ తీసుకున్నది, రాసింది పదో తరగతి పరీక్షలని ఎన్‌ఐవోఎస్ అధికారులు స్పష్టంచేస్తున్నారు. అలాంటప్పుడు ఇంటర్ ఎలా పాసవుతారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాము ఇంకా టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల చేయలేదని, ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

1207

More News

VIRAL NEWS