సుప్రీంకు సీబీఐ మాజీ చీఫ్ నాగేశ్వరరావు క్షమాపణ

Tue,February 12, 2019 12:32 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు సోమవారం సుప్రీంకోర్టుకు భేషరతుగా క్షమాపణ చెప్పారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావు విధాన నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఆదేశాలు జారీ చేసింది. కానీ బీహార్ షెల్టర్ హోమ్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మను నాగేశ్వరరావు బదిలీ చేశారు. దీన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా పరిగణిస్తూ.. నాగేశ్వరరావుకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఈ నెల7న జరిగిన విచారణలో నాగేశ్వరరావు తీరుపై మండిపడింది. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించారు. తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించాలని తాను కలలో కూడా అనుకోనని చెప్పారు.

426
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles