ఇక చాలుFri,October 13, 2017 02:19 AM

మోదీపై శత్రుఘ్నసిన్హా ఘాటు వ్యాఖ్యలు
Shatrughan
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ వ్యవహార శైలిపై బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి ఘాటుగా స్పందించారు. విబేధించే ప్రజాప్రతినిధులను, పార్టీ సీనియర్లను అవమానించటం మంచిపద్ధతి కాదం టూ హితవు పలికారు. శనివారం జరిగే పాట్నా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు తనను ఆహ్వానించకపోవటంపై ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీతో అభిప్రాయబేధాల కారణంగానే తనను ఈ ఉత్సవానికి ఆహ్వానించలేదని పేర్కొన్నారు. పాట్నా యూనివర్సిటీ తన నియోజకవర్గంలో ఉన్నప్పటికీ, పూర్వ విద్యార్థినైన తనను పిలువకపోవటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ఉత్సవాలకు మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌సిన్హాను, ఆర్జేడీ నేత లాలూప్రసాద్‌ను ఆహ్వానించకపోవటాన్ని కూడా శత్రుఘ్నసిన్హా తప్పుపట్టారు. తన నియోజకవర్గంలో ప్రధాని ప్రారంభించనున్న రైల్వే బ్రిడ్జి, ఇతర పథకాల ప్రచార ప్రకటనల్లో తనపేరు లేకపోవటంపైనా అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులను, పార్టీ సీనియర్లను అవమానించటం మంచిపద్ధతి కాదన్న ఆయన ఇవి ఇకచాలు అని పేర్కొన్నారు.

187

More News

VIRAL NEWS