త్వరలోనే నిన్ను ఎన్‌కౌంటర్ చేస్తాం!


Mon,April 16, 2018 02:18 AM

Encounter target releases audio clip

-బీజేపీ ఎమ్మెల్యేతో బేరం కుదుర్చుకోవాలని నిందితుడికి యూపీ పోలీస్ బెదిరింపు
-ఆడియో బయటకు రావడంతో పోలీస్ అధికారి సస్పెన్షన్
lekaraj-singh
లక్నో: పలు కేసుల్లో బెయిల్‌పై ఉన్న నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తానని ఓ పోలీస్ అధికారి బ్లాక్‌మెయిల్ చేస్తూ బేరమాడిన ఆడియో బయటకు రావడంతో నిందితుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో చోటుచేసుకున్నది. 70 కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ ప్రజాప్రతినిధి లేఖరాజ్‌సింగ్‌యాదవ్‌కు మయూరాణీపూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో సునీల్‌కుమార్‌సింగ్ ఫోన్‌చేసి బీజేపీ నాయకులతో ఒప్పందం కుదుర్చుకోవాలని లేదా ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. ఎన్‌కౌంటర్ల సీజన్ ప్రారంభమైంది. నీ మొబైల్ నంబర్ నిఘా దృష్టిలో ఉన్నది. నిన్ను త్వరలోనే చంపేస్తాం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యేతో మాట్లాడి బేరం కుదుర్చుకో. లేదా ఏమైనా జరుగొచ్చు అని సునీల్‌కుమార్‌సింగ్ హెచ్చరించాడు. ఫోన్ సంభాషణ తర్వాత సింగ్ పోలీసు బృందం యాదవ్‌ను అరెస్ట్ చేసేందుకు అతని గ్రామానికి వెళ్లింది. పోలీసులపై కాల్పులు జరిపి అక్కడి నుంచి తప్పించుకున్న యాదవ్.. సునీల్‌కుమార్‌సింగ్ మాట్లాడిన ఆడియోను మీడియాకు అందజేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఆడియో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు సింగ్‌ను సస్పెండ్ చేశారు.

2955
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS